AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

ఒకే ఒక్క సినిమాతోనే తెలుగు, కన్నడ సినీరంగంలో చాలా పాపులర్ అయ్యింది పూజా గాంధీ. దండుపాళ్యం క్రైమ్ థ్రిల్లర్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టించిన పూజా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఆమె న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..
Dandupalyam
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2024 | 5:56 PM

Share

దండుపాళ్యం తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అంత ఈజీగా మర్చిపోరు. డైరెక్టర్ శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా 2012లో విడుదలైంది. మొదట్లో కన్నడలో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, పి.రవిశంకర్, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించారు. దండుపాళ్యం అనే పేరుమోసిన ముఠా నిజ జీవితంలోని దోపిడీల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. కొన్ని థియేటర్లలో దాదాపు 100 రోజులకు పైగా ఆడింది. కన్నడలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది పూజా.

దండుపాళ్యం ఫ్రాంచైజీలో మొదటి భాగం.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ దండుపాళ్యం 2 మూవీ 2014 జూలైలో విడుదలైంది. ఇందులో పూజా గాంధీ ప్రధాన పాత్రలో నటించింది. దండుపాళ్యం ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సీక్వెల్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సీక్వెల్స్ అన్నింటిలోనూ పూజా గాంధీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇందులో బోల్డ్ గా నటిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తనదైన నటనతో జనాలను భయపెట్టింది. పూజా గాంధీ కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి. తమిళం, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఎక్కువగా దండుపాళ్యం సినిమాలతోనే పాపులర్ అయ్యింది.

2021 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న పూజా.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ జనాలకు దగ్గరగా ఉంటుంది. సినిమాల తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసింది. 2012లో జనతాదళ్ పార్టీలో చేరి, వెంటనే కేజేపీ పార్టీలోకి మారింది. ఆ తర్వాత బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో