Tollywood: సీన్ సీన్‏కో అదిరిపోయే ట్విస్టులు.. పిల్ల కోసం తల్లిని పెళ్లిచేసుకున్న ఘనుడు.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే..

హారర, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీంతో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సైతం ఇలాంటి జానర్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. కానీ ఇప్పుడు ఓటీటీలో ఓ హాలీవుడ్ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది.

Tollywood: సీన్ సీన్‏కో అదిరిపోయే ట్విస్టులు.. పిల్ల కోసం తల్లిని పెళ్లిచేసుకున్న ఘనుడు.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే..
Lolitha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2024 | 9:45 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా హరర్ మూవీస్, సస్పెన్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హారర్, మిస్టరీస్ కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు మేకర్స్. అలాగే రొమాంటిక్ మూవీస్ సైతం సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ సినిమా అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?.. కూతురి కోసం ఆమె తల్లిని పెళ్లి చేసుకుని.. కూతురు రూపాన్ని ప్రేమించే ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఆ సినిమా పేరు లోలిత. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

కథ విషయానికి వస్తే..

హీరో తన టీనేజ్‏లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోతుంది. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయిని తలుచుకుని జీవిస్తూ ఉంటాడు. అయితే ఉద్యోగం కోసం ఒక ఊరికి వెళ్లిన అతడికి.. అచ్చం చనిపోయిన తన ప్రియురాలి మాదిరిగానే మరో అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఆ అమ్మాయిని నిత్యం చూస్తూ ఉండేందుకు ఆమె ఇంట్లోనే ఓ గదిలో అద్దెకు దిగుతాడు. అప్పటి నుంచి ఆమెను చూస్తూ సంతోషపడుతుంటాడు. అయితే ఆమెను హాస్టల్లో వేస్తున్నానని ఆమె తల్లి ఇతనితో చెప్పగా.. హాస్టల్ కు వెళ్లే ముందు ఆ అమ్మాయి హీరోను కలుస్తుంది. హాస్టల్ నుంచి వచ్చాకా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది.

ఆమె తల్లిని పెళ్లి చేసుకుంటే అక్కడే ఆ అమ్మాయిని చూస్తూ ఉండొచ్చు అని వెంటనే ఆ అమ్మాయి తల్లిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఒకరోజు అతడి డైరీని ఆ అమ్మాయి తల్లి చూస్తుంది. తన కూతురిని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని అతడితో గొడవపడి బయటికి వెళ్తుండగా.. కారు ప్రమాదంలో చనిపోతుంది.

అయితే తన తల్లి చనిపోయిన విషయం ఆ అమ్మాయికి చెప్పకుండా బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమవుతుంది.. ? హీరో గురించి అసలు నిజాలు ఆ అమ్మాయి తెలుసుకుంటుందా అనేది సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.