- Telugu News Photo Gallery Cinema photos Samantha and Varun Dhawan Hot Photoshoot for Citadel Web Series Promotions
Samantha: సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్.. బాలీవుడ్ స్టార్ హీరోతో సమంత హాట్ ఫొటో షూట్
సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత సమంత నటించడంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సమంత, వరుణ్ ఒక ఫొటో షూట్ లో పాల్గొన్నారు.
Updated on: Nov 07, 2024 | 8:12 AM

సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్‌ధావన్‌తో కలిసి హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చారు ఈ బ్యూటీ. ఈ ఫొటోలు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు స్టార్ నటులు సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు.

దాదాపు 200 దేశాల్లో ఈ షో ట్రెండింగ్‌లో ఉన్నట్టుగా వెల్లడించారు మేకర్స్. పూర్తిగా ఇండియన్ స్టైల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కిన సిటాడెల్‌కు ఈ రేంజ్ రెస్పార్స్ రావటంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

డిజిటల్‌లో ఆ రేంజ్‌లో దుమ్మురేపారు సామ్. ఇప్పుడు రాజ్ అండ్ డీకేతో ఆమె సిటాడెల్ చేశారు. ఓటీటీలో రిలీజ్‌కి రెడీ అంటున్న సిటాడెల్ ప్రమోషన్ల విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు సామ్.

'సిటాడెల్: హనీ బన్నీ' మూడేళ్ల షూటింగ్ తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్‌ను విడుదల చేస్తోంది. కాబట్టి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ 'సిటాడెల్' ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్ నటించారు




