AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orange: రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

సినిమా కాన్సెప్టు బాగున్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కని సినిమాల లిస్ట్ తిరగేస్తే అందులో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. 'ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది' అంటూ 2010లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పటికీ టీవీల్లో వస్తే చూడకుండా వదిలిపెట్టని వారు చాలా మందే ఉన్నారు.

Orange: రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Orange Movie
Basha Shek
|

Updated on: Nov 09, 2024 | 1:05 PM

Share

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆరెంజ సినిమా రిలీజైనప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. రియాలిటీకి దగ్గరగ ఉండడం ఒక కారణంగా కాగా, ఈ సినిమా అడ్వాన్స్ జనరేషన్ లో అంటే ఇప్పటి తరంలో విడుదల కావాల్సిన చిత్రమంటూ చాలా మంది ఆరెంజ్ ఫెయిల్యూర్స్ కు కారణాలు విశ్లేషించారు. అయితే 2010లో డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం. కాగా ఇందులో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించగా, ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా మరో హీరోయిన్ నటించింది. ఆ నటి పేరు షాజన్ పదంసీ. ‘రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయిరబ్బా’ అని సినిమాలో రామ్ చరణ్ పాడినట్లే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది షాజన్. సినిమాలో ఆమె కనిపించేది కొద్ది సేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును కవ్వించింది.

ఆరెంజ్ సినిమా హిట్ కాకపోయినా షాజన్ క్యూట్ నెస్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆమె తెలుగులో బిజీ యాక్టర్ అయిపోతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ఆరెంజ్ తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీలో నటించింది. అదే వెంకటేశ్, రామ్ మల్టీ సార్టర్లుగా నటించిన మసాలా. ఇందులో రామ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో తళుక్కుమంది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకున్నా హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. 2023లో పాగల్ పన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించినా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అడపా దడపా హిందీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది షాజన్. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతుందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

షాజన్ పదంసీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us