AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krish Jagarlamudi: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈ డాక్టరమ్మనే! నెట్టింట వైరలవుతోన్న ఫొటోస్

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తాడని పేరున్న క్రేజీ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి త్వరలోనే మళ్లీ పెళ్లి పీటలెక్కనున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వైద్యురాలితో కలిసి ఆయన వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Krish Jagarlamudi: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈ డాక్టరమ్మనే! నెట్టింట వైరలవుతోన్న ఫొటోస్
Director Krish Jagarlamudi
Basha Shek
|

Updated on: Nov 09, 2024 | 11:33 AM

Share

గమ్యం సినిమాతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఇక అల్లు అర్జున్, మంచు మనోజ్ లతో కలిసి మల్టీ స్టారర్ మూవీ వేదంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. వీటి తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర సినిమాలతో టాలీవుడ్ వెర్స టైల్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ ఈజ్ బ్యాక్ (ఠాగూర్ రీమేక్) తో బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు క్రిష్. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలు క్రిష్ ను కాస్త వెనక్క నెట్టాయి. కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కాసులు రాలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం అనుష్కా శెట్టితో కలిసి ఘాటీ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఘాటీపై అంచనాలను రెట్టింపు చేసింది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రిష్ వ్యక్తిగత జీవితం ఒడిదొడుకులతో కొనసాగుతోంది. 2016లో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ క్రేజీ డైరెక్టర్ రెడీ అయ్యాడని సమాచారం. హైదరాబాద్‌ కి చెందిన ఓ ప్రముఖ వైద్యురాలితో క్రిష్ వివాహం జరగనుందని సమాచారం. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం. ఈ క్రమంలోనే క్రిష్ కు కాబోయే భార్యకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వధువు ఆమెనో కాదో తెలియాలంటే మాత్రం పెళ్లి వరకు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

వైరలవుతోన్న ఫొటోస్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు