AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil: తిరుమల శ్రీవారి సేవలో హీరో నిఖిల్.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం.. వీడియో చూడండి

టాలీవుడ్ క్రేజీ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబర్ 8న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు నిఖిల్.

Nikhil: తిరుమల శ్రీవారి సేవలో హీరో నిఖిల్.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం.. వీడియో చూడండి
Actor Nikhil Family
Basha Shek
|

Updated on: Nov 10, 2024 | 8:54 AM

Share

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శనివారం (నవంబర్ 10) ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. నిఖిల్ వెంట ఆయన భార్య, మామా, చీరల ఎమ్మెల్యే కొండయ్య తదితరులు ఉన్నారు. ఆలయాధికారులు వీరికి సాదర స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం బయటకు వచ్చిన నిఖిల్ ను చూసిన భక్తులు, అభిమానులు అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నిఖిల్ కూడా ఎంతో ఓపికతో అడిగిన వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం నిఖిల్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

కాగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై సినిమాలు కూడా ఓ మోస్తరు విజయం సాధించాయి. ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అని రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీతో మన ముందుకు వచ్చాడు. నవంబర్ 8న విడుదలైన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. దివ్యాంశ్ కౌశిక్ సెకెండ్ హీరోయిన్ గా మెప్పించింది.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారి సేవలో నిఖిల్ ఫ్యామిలీ..  వీడియో..

కాగా కార్తికేయ 2 తర్వాత స్వయంభు పేరుతో మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

స్వయంభు సినిమా షూటింగ్  తో బిజీగా ఉంటోన్న నిఖిల్ సిద్ధార్థ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..