AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Napoleon: వీల్‌ ఛైర్‌కే పరిమితమైన కుమారుడిని ఓ ఇంటివాడిని చేసిన నటుడు నెపోలియన్.. జపాన్‌లో గ్రాండ్‌గా పెళ్లి

ప్రముఖ తమిళ నటుడు నెపోలియన్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన ఆయన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. ఇక రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా వ్యవహరించారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

Napoleon: వీల్‌ ఛైర్‌కే పరిమితమైన కుమారుడిని ఓ ఇంటివాడిని చేసిన నటుడు నెపోలియన్.. జపాన్‌లో గ్రాండ్‌గా పెళ్లి
Napoleon Son Wedding
Basha Shek
|

Updated on: Nov 10, 2024 | 8:02 AM

Share

ప్రముఖ తమిళ నటుడు నెపోలియన్ కుమారుడు ధనూష్ ఓ ఇంటి వాడయ్యాడు. తిరునల్వేలికి చెందిన అక్షయ అనే అమ్మాయితో ఈ వివాహం జరిగింది. జపాన్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు దగ్గరి బంధువులతో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. కార్తీ, శరత్ కుమార్, రాధిక, మీనా, కుష్బూ, సుహాసిని, కలా మాస్టర్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే అమరన్ హీరో శివ కార్తీకేయన్ కొత్త దంపతులకు వీడియో సందేశం పంపాడు. కాగా ధనూష్ కు చిన్నప్పటి నుంచే జపాన్ చూడాలని కల ఉండేది. ఇప్పుడు తన కుమారుడికి జపాన్‌లో వివాహం జరిపించాడు నెపోలియన్. తద్వారా తండ్రిగా తన కుమారుడి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఈ పెళ్లిపై మండి పడుతున్నారు. ఎందుకంటే ధనూష్ చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు అతనికి పెళ్లి చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అనారోగ్యంతో బాధపడుతూ వీల్ చైర్ కు పరిమితమైన ధనుష్‌ కు పెళ్లి చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కుమారుడు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎందుకు పెళ్లి చేశావ్? అంటూ కొందరు నెపోలియన్ పై మండిపడుతున్నారు. మరోవైపు డబ్బు కోసమే ఆ అమ్మాయి ధనుష్ ను పెళ్లి చేసుకుందంటూ వధువుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మయోపతి వైద్యుని నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ధనుష్‌కు పెళ్లి చేస్తున్నట్లు నెపోలియన్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 కన్నీళ్లు పెట్టుకున్న నెపోలియన్.. వీడియో

డాక్టర్ సలహాతోనే పెళ్లి..

‘ నాకు డబ్బు, సంపద పట్టించుకోను. నా కుమారుడి భవిష్యత్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొంటాను. కండరాల బలహీనత ఉన్న వ్యక్తులు వివాహానికి పనికిరారని చెప్పడంలో నిజం లేదు. ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నవారిలో కొందరు ఇప్పటికే వివాహమై పిల్లలతో జీవిస్తున్నారు’ అని ధనుష్ కు చికిత్స అందించిన డానియెల్ చెప్పిన తర్వాతే నా కుమారుడికి వివాహం జరిపించాను’ అని నెపోలియన్ చెబుతున్నారు.

పెళ్లి ఫొటోలు ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.