Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Nanna Superhero OTT: అఫీషియల్.. ఓటీటీలో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. అభిలాష్ కంకర తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్ణా, షాయాజీ షిండే, సాయిచంద్ త్రిపురనేని, విష్ణు, శశాంక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ ఎమోషనల్ డ్రామా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

Maa Nanna Superhero OTT: అఫీషియల్.. ఓటీటీలో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Maa Nanna Superhero Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2024 | 10:43 PM

భారతదేశంలోని అతిపెద్ద ఓటీటీ సంస్థ అయిన ZEE5లో ఇటీవల విడుదలైన తెలుగు బ్లాక్‌బస్టర్ ‘మా నాన్న సూపర్’ డిజిటల్ ప్రీమియర్‌ను ప్రకటించింది. లూజర్ సిరీస్‌ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయి చంద్, ఆర్నా వంటి వారు నటించారు. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్, VR గ్లోబల్ మీడియా బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ వచ్చింది. నవంబర్ 15 నుంచి ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కాబోతోంది. హీరో జానీ (సుధీర్ బాబు) తన పెంపుడు తండ్రి (సాయాజీ షిండే) చేసిన అప్పులను తీర్చడానికి కష్టపడుతుంటాడు. అతని పెంపుడు తండ్రి అరెస్ట్ అవ్వడం, విడుదల కోసం రూ. 1 కోటిని సేకరించడానికి జానీ ఏం చేశాడు? ఈ క్రమంలో సొంత తండ్రి ప్రకాష్ (సాయి చంద్)తో కలిసి చేసిన ప్రయాణం ఏంటి? అన్నది ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరో అనేది తండ్రీ కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌తో నేను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యాను. ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రం. థియేటర్‌లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ZEE5లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులు కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఉద్వేగభరితమైన కథనాన్ని ZEE5తో పంచుకోవడం ఆనందంగా ఉంది. ZEE5 ఇస్తున్న సహకారానికి థాంక్స్. ZEE5 ప్లాట్‌ఫారమ్‌తో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ.. ‘ZEE5తో నా ప్రయాణం లూజర్‌తో ప్రారంభమైంది. అది అద్భుతమైన అనుభవం, భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మా నాన్న సూపర్‌ హీరోతో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. ‘తండ్రి ప్రేమే కొడుకు బలానికి పునాది’ అన్న సామెతతో ఈ సినిమాలో సుధీర్ బాబు ఆ పాత్రకి ప్రాణం పోశారు. సుధీర్ బాబు అద్భుతమైన నటనకు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్‌తో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ZEE5తో ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి, భవిష్యత్తులో కలిసి మరిన్ని ప్రభావవంతమైన కథనాలను రూపొందించడానికి ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

జీ5లో స్ట్రీమింగ్..

సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరోకి థియేటర్లలో లభించిన ప్రేమ, ప్రశంసలకు నేను నిజంగా పొంగిపోయాను. జానీ పాత్రను పోషించడంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ప్రేమ, కర్తవ్యం, నిజాల మధ్య నలిగిపోయే పాత్ర. ఈ కథకు జీవం పోయడం ఒక విశేషం. నాకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ZEE5లో సినిమా ప్రీమియర్‌ కానుంది. అప్పుడు కూడా అదే ప్రేమ అందిస్తారని, ఆ పాత్రతో, సినిమాతో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.