AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupam Kher: వందల కోట్ల ఆస్తి.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నటుడు అనుపమ్ ఖేర్.. కారణమేంటో తెలుసా?

బాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరైన అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారీ సీనియర్ యాక్టర్. ఆ మధ్యన రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నిఖిల్ కార్తికేయ2 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు అనుపమ్ ఖేర్.

Anupam Kher: వందల కోట్ల ఆస్తి.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నటుడు అనుపమ్ ఖేర్.. కారణమేంటో తెలుసా?
Anupam Kher Family
Basha Shek
|

Updated on: Nov 11, 2024 | 10:28 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన ‘విజయ్ 69’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ యాక్టర్ కు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఆయనకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ వెల్లడించారు. సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణాలను కూడా వివరించాడు. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివాసముంటున్నాను. అయినా ఎవరి కోసం ఇల్లు కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకుని, కొంత డబ్బుతో ప్రతినెలా అద్దెకడితే సరిపోతుందిగా! ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండవు’

‘నేనుసినిమా కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో సిమ్లాలో ఓ ఇల్లును కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆయన చనిపోయిన తర్వాత మేం సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని కానుకగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది’ అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అనుపమ్ ఖేర్ లాజిక్, థింకింగ్ చాలా కొత్తగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో అనుపమ్ ఖేర్ కొత్త సినిమా స్ట్రీమింగ్..

విజయ్ 69 సినిమా ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్