AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK S4: ఫ్యాన్స్ గెట్ రెడీ.. రెండు భాగాలుగా బాలయ్య, అల్లు అర్జున్ ఐకానిక్ ఎపిసోడ్..

. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ మంచి ఆసక్తికరంగా ఉండనుంది. ఈ ఐకానిక్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, అల్లు ఆర్మీ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా బాలయ్య బన్నీతో ఓ రేంజ్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.  

Unstoppable with NBK S4: ఫ్యాన్స్ గెట్ రెడీ.. రెండు భాగాలుగా బాలయ్య, అల్లు అర్జున్ ఐకానిక్ ఎపిసోడ్..
Unstoppable With Nbk S4
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 8:59 PM

Share

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. మునుపటికంటే రెట్టింపు ఎనర్జీతో బాలయ్య ఈ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్‌లుగా హాజరయ్యారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలయ్య షోకి అతిథిగా హాజరయ్యారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ఈ ఐకానిక్ ఎపిసోడ్ నవంబర్ 15, 2024న అర్ధరాత్రి 12 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ మంచి ఆసక్తికరంగా ఉండనుంది. ఈ ఐకానిక్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, అల్లు ఆర్మీ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా బాలయ్య బన్నీతో ఓ రేంజ్‌లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తన కెరీర్ తొలి రోజుల దగ్గర నుంచి నటుడిగా ఎదిగిన అనుభవాలను, జాతీయ అవార్డు అందుకున్న ప్రయాణం వరకు ఎన్నో విషయాలను పంచుకోనున్నారు. అల్లు అర్జున్ చిన్నతనంలో చేసిన అల్లరి, చిలిపి చేష్టలతో సహా, స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత అతని జీవితం అలాగే ప్రాధాన్యతలు ఎలా మారాయి అనే దాని గురించి కూడా మాట్లాడారు.

ఎపిసోడ్‌లో ముఖ్యంగా ఉద్వేగభరితమైన క్షణం అల్లు అర్జున్ జాతీయ అవార్డును గెలవాలనే తన చిరకాల కోరిక గురించి మాట్లాడటమే.. ఇన్నాళ్లుగా ఏ తెలుగు నటుడికీ ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కకపోవడం తనను ఎంతగా బాధించిందో తెలిపారు బన్నీ. ఆ బాధే ఇప్పుడు ఈ గుర్తింపును పొందేందుకు తనను ప్రేరేపించిందని ఆయన అన్నారు. 2023లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్.

అలాగే బాలయ్య షోలో అల్లు అర్జున్ బాలీవుడ్, టాలీవుడ్ స్టార్‌ల పట్ల తనకున్న అభిమానం గురించి కూడా మాట్లాడారు. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, లెజెండరీ రజనీకాంత్ గురించి కూడా మాట్లాడారు అల్లు అర్జున్. ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ తల్లి నిర్మల అల్లు గెస్ట్ సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె బన్నీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఐకానిక్ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఎపిసోడ్ నవంబర్ 15, 2024న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆహాలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..