AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ 100 కోట్ల సినిమా.. లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదలైంది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైందని తెలుస్తోంది.

Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ 100 కోట్ల సినిమా.. లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lucky Baskhar Movie
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 10:14 PM

Share

మహానటి, సీతారామం సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మరో సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అంతేకాదు లక్కీ భాస్కర్ సినిమాతో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు దుల్కర్ సల్మాన్. అమరన్, క, బఘీరా లాంటి సినిమాలు పోటీలో ఉన్నా లక్కీ భాస్కర్ కు భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో దుల్కర్ సల్మాన్ సినిమా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.  ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 30 కోట్లకు పైగానే డీల్ జరిగినట్లు తెలుస్తోంది. డీల్ ప్రకారం నెల రోజుల తర్వాత నే లక్కీ భాస్కర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే నవంబర్ 30న లేదా  ఆతర్వాతి తేదీల్లో దుల్కర్ సల్మాన్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందన్నమాట. త్వరలోనే లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కించారు. రాంకీ, సూర్య శ్రీనివాస్, మానస చౌదరి, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్, కసిరెడ్డి, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.  జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

ఇవి కూడా చదవండి

వంద కోట్ల క్లబ్ లో లక్కీ భాస్కర్..

నవంబర్ 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..