AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable Season 4: పవన్ కల్యాణ్‌ గురించి ఓపెన్‌ అయిన అల్లు అర్జున్.. బాలయ్య టాక్ షోలో ఏమన్నాడంటే?

పుష్ఫ 2 ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు వచ్చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షోలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బన్నీ.

Unstoppable Season 4: పవన్ కల్యాణ్‌ గురించి ఓపెన్‌ అయిన అల్లు అర్జున్.. బాలయ్య టాక్ షోలో ఏమన్నాడంటే?
Unstoppable Season 4
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 11:02 PM

Share

నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు గెస్ట్ లుగా వ‌చ్చారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. పుష్ఫ 2 రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ షోకు వచ్చిన బన్నీ బాలయ్యతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జాతీయ అవార్డు అందుకోవడం, మెగా ఫ్యామిలీతో సంబంధాలు, ప్రభాస్, మహేష్ బాబులతో తన రిలేషన్.. ఇలా పలు విషయాలపై ఓపెన్ అయ్యాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తనుకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు బన్నీ. అన్ స్టాపబుల్ షోలో భాగంగా సెలబ్రిటీల ఫొటోలను చూపించిన బాలయ్య.. వారితో తనకున్న అనుబంధాన్ని చెప్పమని బన్నీని అడిగారు. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ ఫోటోను చూపించగానే.. ‘కళ్యాణ్ గారు అంటూ’ కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపించారు బన్నీ.ఆ తర్వాత తన దారిలో తాను వెళ్లిపోతాడని బాలయ్య అనగానే.. అంతే అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

గత కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వార్ జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ సీపీ అభ్యర్ధికి మద్దతు తెలియజేయడంతో ఈ ఫ్యాన్స్ వార్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది తారాస్థాయికి చేరుకుంది. మరి బాలయ్య షో లో అల్లు అర్జున్ ఈ విషయం గురించి నోరు విప్పుతాడని, వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ పై బన్నీ కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరి ప‌వ‌న్ కల్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ గురించి బ‌న్నీ ఏం మాట్లాడాడు తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

మరికొన్ని నిమిషాల్లో అందుబాటులోకి ఫుల్ ఎపిసోడ్

బాలయ్య- బన్నీల అన్ స్టాపబుల్   ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..