Vicky Kaushal: డిఫరెంట్ మూవీస్ చేస్తున్న విక్కీ కౌశల్
ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు విక్కీ కౌషల్. డిఫరెంట్ మూవీస్‌తో బాలీవుడ్‌లో సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రజెంట్ డిఫరెంట్ మూవీస్‌తో అలరిస్తున్నారు. ముఖ్యంగా హిస్టారికల్, మైథలాజికల్ కాన్సెప్ట్స్‌కు కేరాఫ్‌గా మారారు విక్కీ.
Updated on: Nov 14, 2024 | 10:55 PM

Vicky Kaushal (1)

యురి, సర్దార్ ఉద్దమ్, సామ్ బహద్దూర్ సినిమాలతో బెస్ట్ పర్ఫామర్‌గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌషల్. అన్ సంగ్ హీరోస్ రోల్స్‌కు తాను బెస్ట్ అప్షన్ అని ప్రూవ్ చేసుకోవటంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది. ఆ ఇమేజ్‌ను అలాగే కాపాడుకుంటూ డిఫరెంట్ మూవీస్‌ను లైన్‌లో పెడుతున్నారు విక్కీ.

త్వరలో ఛావా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు విక్కీ కౌషల్. శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ హిస్టారికల్ క్యారెక్టర్‌ను ప్లే చేశారు. టీజర్‌లో విక్కీ లుక్, పెర్ఫామెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో క్రేజీ మూవీకి విక్కీ కౌషల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ పౌరాణిక పాత్ర నేపథ్యంలో ప్లాన్ చేస్తున్న సినిమాలో విక్కీ టైటిల్ రోల్‌లో నటించబోతున్నారు. ముంజ్యా, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన దినేష్ విజన్, పరుశురాముడి పాత్ర ఆధారంగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పరశురాముడిగా నటించేందుకు విక్కీ ఓకే చెప్పారు.

ప్రజెంట్ స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్న మైథలాజికల్ మూవీ నెక్ట్స్ ఇయర్ ఎండింగ్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ లోగా తన కమిట్మెంట్స్‌ను పూర్తి చేసి, పౌరాణిక పాత్ర కోసం మేకోవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు విక్కీ కౌషల్. ఇలా డిఫరెంట్ మూవీస్‌తో బాలీవుడ్‌లో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ యంగ్ హీరో.




