హీరోలందరి ఆయుధం అదొక్కటే.. అది ఉంటె సినిమా హిట్టే
గడ్డం ఉంటే సినిమా హిట్ అయిపోతుందా..? ఎహే ఊరుకోండి మరీ కామెడీగా మాట్లాడుతున్నారు మీరు.. కథ బాగుంటే హిట్ అవుతుంది కానీ గడ్డం పెరిగితే సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనుకోవచ్చు. నవ్వుకుంటారేమో గానీ ఈ మధ్య మన హీరోలకు నిజంగా గడ్డం ఫోబియా పట్టుకుంది. పెద్ద హిట్టైన ప్రతీ సినిమాలోనూ హీరోలకు గడ్డం ఉంది. ఈ బీర్డ్‌పైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 14, 2024 | 11:12 PM

Devara (4)

భాషతో సంబంధం లేదు.. ట్రెండ్ ఏదుంటే అది ఫాలో అవ్వాలంతే. గడ్డం విషయంలో మన హీరోలు ఇదే చేస్తున్నారిప్పుడు. తెలుగు, తమిళం పనిలేదు.. పీరియడ్, ప్రస్తుతం అవసరం లేదు.. అన్ని సినిమాల్లోనూ గడ్డంతోనే కనిపిస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమాకు సింబాలిక్‌గా మారిపోయింది గడ్డం. ఈ మధ్యే గేమ్ ఛేంజర్‌లోనూ చరణ్ ఓ లుక్ కోసం గడ్డం పెంచారు.

బాహుబలి నుంచి ఈ గడ్డం ఫోబియా పట్టుకుంది. దానికంటే ముందు కూడా హీరోలు గడ్డం లుక్‌లో కనిపించారు కానీ అప్పట్నుంచి ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. రంగస్థలం, పుష్ప, భగవంత్ కేసరి, దసరా, దేవర ఇలా ఏ సినిమా తీసుకున్నా హీరోను గడ్డంతోనే చూపించారు దర్శకులు. అది బాగా క్లిక్ అయింది కూడా. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు లుక్ పరంగా ట్రెండ్ సెట్ చేసాయి కూడా.

ఇదే ఓ ట్రెండ్‌లా కంటిన్యూ చేస్తున్నారు మన హీరోలు. విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డితో ఓ కొత్త ట్రెండ్‌కు తెర తీసారు. అసలు గడ్డంతో హీరోలు ఇంత బాగుంటారా అనేలా ఒరవడి సృష్టించారు. మరోవైపు పీరియడ్ సినిమాలకు గడ్డం అనేది కామన్ అయిపోయింది. సీనియర్స్ మాత్రమే కాదు.. నాని, తేజ సజ్జా, నిఖిల్ లాంటి హీరోలు సైతం గడ్డం లుక్‌లోనే కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

బీర్డ్ లుక్ అంటేనే నోనో అనే మహేష్ బాబు సైతం.. గుంటూరు కారంలో గడ్డంతో కనిపించారు. తాజాగా రాజమౌళి కోసం పూర్తి బీర్డ్ లుక్‌లోనే కనిపించబోతున్నారు. విశ్వంభరలో చిరంజీవి.. NBK109లో బాలయ్య.. ఆ మధ్య నా సామిరంగాలో నాగార్జున.. ఇలా ఎలివేషన్ కోసం గడ్డాన్ని మించిన ఆయుధం లేదని నమ్ముతున్నారు హీరోలు. ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దర్శకులు అదే ఫాలో అవుతున్నారు.





























