AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable Season 4: ‘ప్రభాస్ ఆరడుగుల బంగారం’.. బాలయ్య షోలో డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. ఇప్పటికే ఎంతో మంది సినీ , రాజకీయ ప్రముఖులు ఈ సెలబ్రిటీ టాక్ షోలో సందడి చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలయ్య షోలో సందడి చేశారు. అతను ఈ షోకు రావడం ఇది రెండోసారి.

Unstoppable Season 4: 'ప్రభాస్ ఆరడుగుల బంగారం'.. బాలయ్య షోలో డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్
Unstoppable Season 4
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 11:33 PM

Share

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో రన్ అవుతన్నషో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అతనితో పాటు తల్లి నిర్మలమ్మ కూడా ఈ టాక్ షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఫైరింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రభాస్‌ గురించి బన్నీ మాట్లాడిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అందులో బాలయ్య ప్రభాస్ ఫొటోను చూపించగా బన్నీ ఇలా చెప్పుకొచ్చాడు ‘ ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని’ ఆకాశానికెత్తేశాడు. ఈ ప్రోమోను చూసిన బన్నీ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో ప్రభాస్ గురించి చెబుతూ ఆకాశానికెత్తాడు బన్నీ. ‘ప్రభాస్ నా ఫేవరెట్ హీరో మాత్రమే కాదు. ఫేవరెట్ పర్సన్ కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని’ ఓ సినిమా ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ అద్భుతమైన నటుడని.. తెలుగు సినిమా ఖ్యాతి పెంచాడని మరో సందర్భంలో మెచ్చుకున్నాడు బన్నీ. ఇప్పుడు ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్‌ షోలోనూ రిపీట్‌ చేశాడు అల్లు అర్జున్. దీంతో ప్రభాస్, బన్ని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, మహేశ్‌ బాబుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బన్నీ. వారితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు.

అన్ స్టాపబుల్ ప్రోమో..

గతంలో ప్రభాస్ గురించి బన్నీ ఇలా..

మెగా ఫ్యామిలీ, ప్రభాస్, మహేష్ బాబుల గురించి బ‌న్నీ ఇంకా ఏమేమి మాట్లాడో తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

మరికొన్ని నిమిషాల్లో అందుబాటులోకి ఫుల్ ఎపిసోడ్

బాలయ్య- బన్నీల అన్ స్టాపబుల్   ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.

Follow Us
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ దిక్కున పెడితే ధనయోగం
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ దిక్కున పెడితే ధనయోగం
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..