Pushpa 2: పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.. ఎలాగో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పుష్ఫ 2. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రేజీ మూవీలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.

Pushpa 2: పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.. ఎలాగో తెలుసా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2024 | 9:21 PM

అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. చిత్ర కథానాయిక రష్మిక మందన్న తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా రష్మిక మందన్న స్వయంగా తన డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. ఈ సాంగ్ కోసం చాలా మంది నటీమణులను పరిశీలించిన దర్శకుడు సుకుమార్.. చివరకు డ్యాన్సింగ్ క్వీన శ్రీలీలని ఎంచుకున్నాడు. 2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్‌లో నర్తించింది. ఈ పాట పెద్ద హిట్ అయింది. సినిమా విడుదలకు ముందే విడుదలైన ఈ పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలకపాత్ర పోషించింది. దాంతో ‘పుష్ప 2′ సినిమాలోని ఐటెం సాంగ్‌ని కూడా సీరియస్‌గా పరిగణించిన చిత్ర బృందం.. ఆ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్‌ని తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్ అందాల తారలు శ్రద్ధా కపూర్, కియారా అద్వానీని కూడా అడిగారు. సాహోతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన శ్రద్ధా కపూర్ అయితే దాదాపుగా ఫైనల్ అయిపోయింది. అయితే చివరికి మళ్లీ మనసు మార్చుకున్నపుష్ఫ 2 చిత్ర బృందం శ్రీలీలని స్పెష్ సాంగ్ కోసం ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో పుష్ఫ 2 చిత్ర బృందానికి ఏడు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

పుష్ప 2’ స్పెషల్ సాంగ్ కోసం డ్యాన్స్ చేయడానికి శ్రద్ధా కపూర్ 8 కోట్లు అడిగిందట. కానీ శ్రీలీల మాత్రం ఒక్క కోటి రెమ్యునరేషన్ తోనే ఈ సాంగ్ చేసేందుకు అంగీకరించిందని సమాచారం. కాగా శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ ఎనర్జీకి తగ్గ నటి కావడంతో చిత్ర బృందం శ్రీలీలనే ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోన్న శ్రీలీల పుష్ఫ 2 సినిమతో అక్కడ తన క్రేజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తోంది.

ఇవి కూడా చదవండి

కిస్సిక్ సాంగ్ లో శ్రీలీల లుక్..

‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనాలు పెరిగాయి. అమెరికా, యూఏఈ, రష్యా, జపాన్ తదితర దేశాల్లో ఏకకాలంలో సినిమా విడుదల కానుంది. రష్మిక మందన్న, డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

డిసెంబర్ 05న గ్రాండ్ రిలీజ్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.