AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: భర్తపై ప్రేరణ ముద్దుల వర్షం.. ఫీలైన విష్ణు, యష్మి.. తేజ కల నెరవేర్చిన బిగ్‏బాస్..

గార్డెన్ ఏరియాను మొత్తం బెలూన్స్‏తో డెకరేట్ చేసి ప్రేరణకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక హౌస్ లోపలికి వచ్చిన తన భర్త శ్రీపాదను చూసి పరుగున వెళ్లి హగ్ చేసుకుంది ప్రేరణ. శ్రీపాద రావడంతో తన భార్య నుదిటిన తిలకం దిద్దాడు. అనంతరం వీరిద్దరు గార్డెన్ ఏరియాలో సంతోషంతో ఉండగా.. యష్మీ, విష్ణు తెగ ఫీలయ్యారు.

Bigg Boss 8 Telugu: భర్తపై ప్రేరణ ముద్దుల వర్షం.. ఫీలైన విష్ణు, యష్మి.. తేజ కల నెరవేర్చిన బిగ్‏బాస్..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 7:29 AM

Share

ఫ్యామిలీ వీక్ పూర్తైంది. దీంతో ప్రేరణ భర్త శ్రీపాద కటౌట్ స్టోర్ రూంలో పెట్టాలని బిగ్‏బాస్ చెప్పగా.. స్టోర్ రూంలో శ్రీపాద ఫోటో పెట్టి ఏడవడం స్టార్ట్ చేసింది ప్రేరణ. మరోవైపు టేస్టీ తేజ తల్లిని ఎలాగైనా హౌస్ లోపలికి పంపించాలంటూ రోహిణి, అవినాష్ రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రేరణకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఆమె భర్త శ్రీపాదను హౌస్ లోకి పంపిచడంతో ఎగిలి గంతులేసింది ప్రేరణ. గార్డెన్ ఏరియా మొత్తాన్ని లవ్ సింబల్స్ తో నింపేశారు. దీంతో తన భర్త వస్తున్నట్లు అర్థం చేసుకున్న ప్రేరణ.. అతడి కోసం గార్డెన్ ఏరియాలో వెయిట్ చేసింది. తన శ్రీపాద రాగానే పరుగు పరుగున వెళ్లి భర్తను హగ్ చేసుకుంది. ఇక వీళ్లిద్దరి రొమాన్స్ చూసి యష్మీ, విష్ణు తెగ ఫీల్ అయ్యారు. దీంతో పృథ్వీని తన చున్నీ తీసి ఆ ముసుగులోపలికి లాక్కుంది. పక్కనే ఉన్న తేజ ఏయ్ ఏం చేస్తున్నారూ.. ఏంటీ బ్రో అని అరవడంతో.. ఆ ముసుగు నుంచి బయటకు వచ్చారు విష్ణు, పృథ్వీలు.

పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ తెగ ఫీల్ అయిపోయింది విష్ణు. దీంతో యష్మీ మాట్లాడుతూ.. అతడికి నువ్వంటే ఇష్టం కానీ అది ప్రేమ కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. నాకు ప్రేమే కావాలని పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది విష్ణు. ఇక గార్డెన్ ఏరియాలో ప్రేరణకు హింట్స్ ఇస్తూనే సలహాలు ఇచ్చాడు శ్రీపాద. ఆ తర్వాత భార్య కోసం శ్రీపాద గేమ్ ఆడడంతో కిచెన్ కు మరో రెండు గంటలు యాడ్ అయ్యింది. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ తన తల్లి రాలేదని బాధ పడుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టగా.. అందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు బిగ్ బాస్. అందులో అవినాష్ గెలిచి మెగా చీఫ్ అయ్యాడు. కాసేపటికి ఫోన్ కాల్ ద్వారా తేజను తన తల్లితో మాట్లాడించాడు. తను రావట్లేదని బాధపడకు అంటూ ఫోన్ లో ఓదార్చింది తేజ తల్లి.

కానీ కాసేపటికే హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక తల్లిని చూడగానే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. ఆ తర్వాత తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు.. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే కొడుకు కోసం ప్రేమగా తీసుకువచ్చిన చికెన్, ఆలుగడ్డ కర్రీని అన్నంలో అందరికీ కలిపి తినిపించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన తల్లిని చూడాలని ఉందన్న తేజ కల నెరవేరడంతో మురిసిపోయాడు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us