Varun Tej: వరుణ్ తేజ్ సింప్లిసిటీ.. తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో ముచ్చట్లు.. వీడియో వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా గురువారం (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు వరుణ్ తేజ్ కు సంబంధించిన వీడియ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Varun Tej: వరుణ్ తేజ్ సింప్లిసిటీ.. తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో ముచ్చట్లు.. వీడియో వైరల్
Varun Tej
Follow us
Basha Shek

|

Updated on: Nov 15, 2024 | 9:44 PM

గని, గాంఢీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్.. ఇలా హ్యాట్రిక్ పరాజయాలతో ఢీలా పడిపోయాడు మెగా ప్రిన్స్. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే తలంపుతో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. నవంబర్ 14న మట్కా సినిమా గ్రాండ్ గా రిలీజైంది. కానీ మొదటి షో నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. పలాస సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కరుణ కుమార్ తెరకెక్కించిన మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో అన్నీ తానై వ్యవహరించాడు వరుణ్ తేజ్. విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి.. ఇలా రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింటినీ చుట్టేశాడు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లాడు మెగా ప్రిన్స్. అక్కడి కాలేజీలో విద్యార్థులతో సరదాగా మాట్లాడాడు. ఈ క్రమంలో ఓ ఫిజికల్ ఛాలెంజెడ్ అభిమానిని కలిశాడు. వరుణ్ తేజ్ వస్తున్నాడని తెలిసి ఆ దివ్యాంగురాలు అతన్ని కలవడానికి ఎదురుచూసింది. దీంతో వరుణ్ ఆమె దగ్గరకు వచ్చి అక్కడే కింద కూర్చొని, ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాడు. ఆమెతో కలిసి సరదాగా ఫొటోలు కూడా దిగాడు. ఇందుకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు వరుణ్ సింప్లిసిటీని అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మట్కా సినిమా విషయానికి వస్తే.. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. హీరో హీరోయిన్లతో పాటు ఈ సినిమాలో సలోని, సత్యం రాజేష్, రవి శంకర్, కిషోర్, నవీన్ చంద్ర, అజయ్‌ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. మట్కా అనే గేమ్ ఆధారంగా వైజాగ్ లో ఎదిగిన ఓ డాన్ కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ ఏజ్ లలో కనిపించాడు. సినిమా కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు. అయితే సినిమా మాత్రం సక్సెస్ కాలేదు. కానీ వరుణ్ యాక్టింగ్ పై మాత్రం ప్రశంసలు వస్తున్నాయి.

దివ్యాంగురాలితో కింద కూర్చొని మాట్లాడుతోన్న వరుణ్ తేజ్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.