AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border-Gavaskar Trophy: కెప్టెన్ గా రోహిత్ ఉండగా ఆస్ట్రేలియన్ మీడియాకు అతడే ఎందుకు కీలకమయ్యాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. విరాట్ ప్రస్థుతం కెప్టెన్ కాకపోయినా, ఫామ్ లో లేకపోయినా, పత్రికలు కోహ్లీపై ప్రత్యేక కవరేజీ ఇస్తూ హైలైట్ చేశాయి. అయితే ఇటీవల కోహ్లీ ఫామ్ దృష్ట్యా ఈ సిరీస్ అతనికి కఠిన పరీక్షగా మారే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.

Border-Gavaskar Trophy: కెప్టెన్ గా రోహిత్ ఉండగా ఆస్ట్రేలియన్ మీడియాకు అతడే ఎందుకు కీలకమయ్యాడు
Kohli In Aussie
Narsimha
|

Updated on: Nov 16, 2024 | 9:41 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. జట్టు సభ్యులు పెర్త్ లో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని ఆస్ట్రేలియన్ మీడియా ఆకాశానికెత్తింది. కోహ్లీ ఫోటోను ప్రముఖ వార్తా పత్రిక ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. విరాట్ జట్టు కెప్టెన్ కాకపోయినప్పటికి, ఇటీవల ఫామ్‌లో లేకపోయినప్పటికి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఆస్ట్రేలియా మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు కానీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం దేశానికి వచ్చిన తర్వాత స్టార్ ఇండియా బ్యాటర్‌పై ఆస్ట్రేలియా మీడియా కవరేజీని బట్టి అతను వారికి హాట్ ఫేవరెట్‌గా కొనసాగుతున్నాడని చెప్పవచ్చు. ది వెస్ట్ ఆస్ట్రేలియన్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో సహా వివిధ ఆస్ట్రేలియన్ వార్తాపత్రికలు తమ మొదటి పేజీలలో విరాట్ ను ప్రముఖంగా చూపించాయి. అయితే, ఈ వార్తా కేంద్రాలు గత కోహ్లి ఇటీవలి ప్రదర్శనను కూడా హైలైట్ చేశాయి.

గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ ఫామ్ లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడని ఈసారి ఆస్ట్రేలియాపై కఠినమైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా వార్తా పత్రికలు ప్రస్తావించాయి.

2016 నుండి 2019 వరకు కోహ్లీ ఫామ్ టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ శిఖరాలలో ఒకటిగా మిగిలిపోయింది, ఆ సమయంలో అతను 16 సెంచరీలు మరియు 10 అర్ధసెంచరీలతో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్‌గా అతను ఆల్ టైమ్ రికార్డును కూడా నెలకొల్పాడు.

ఇక 2020 నుండి, విరాట్ సుదీర్ఘమైన ఫార్మాట్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతన్నాడు. 34 టెస్టుల్లో 31.68 సగటుతో 1,838 పరుగులు చేశాడు, ఇందులో కేవలం రెండు సెంచరీలు తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇటీవల బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ లలో మరి దారుణంగా విఫలమయ్యాడు కోహ్లీ. 10 ఇన్నింగ్స్‌లలో 21.33 సగటుతో కేవలం ఒక ఫిఫ్టీ తో 192 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ ప్రస్తుతం ఐసిసి పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్ 20 నుంచి బయటకు రావడం గత దశాబ్దం కాలంలో ఇదే మొదటి సారి.

కోహ్లీ కెరీర్ టెస్ట్ సగటు 47.83గా ఉంది, అయితే అతను ఆస్ట్రేలియాతో వారి సొంత గడ్డపై బ్యాటింగ్ చేయడం విశేషంగా ఆస్వాదిస్తున్నాడని గణాంకాలు సూచిస్తున్నాయి. 13 మ్యాచ్‌లలో, అతను 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు, అతని కెరీర్ సగటు కంటే చాలా ఎక్కువ.

విరాట్ కోహ్లీతో పాటు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై కూడా ఆస్ట్రేలియన్ పత్రికలు దృష్టి పెట్టాయి. పంజాబీ పత్రిక “నవం రాజా” (నయా రాజా) అంటూ అతన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ఇది భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న క్రేజ్‌ను సూచిస్తోంది.