Rohit Sharma: ‘మేం నలుగురం అయ్యాం’.. శుభవార్తను పంచుకున్న రోహిత్ శర్మ.. పోస్ట్ వైరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి గా ప్రమోషన్ పొందాడు . ఆయన సతీమణి రితిక శుక్రవారం (నవంబర్ 15) రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఈ దంపతులకు సమైరా అన్న కూతురు ఉంది. ఇప్పుడు మరొకరు ఈ ఫ్యామిలీలోకి అడుగు పెట్టాడు.

Rohit Sharma: 'మేం నలుగురం అయ్యాం'.. శుభవార్తను పంచుకున్న రోహిత్ శర్మ.. పోస్ట్ వైరల్
Rohit Sharma Family
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2024 | 6:04 PM

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య రితికా సజ్దే శుక్రవారం (నవంబర్ 15) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2015 డిసెంబర్ 13న పెళ్లిపీటలెక్కిన రోహిత్ -రితిక దంపతులకు 2018లో సమైరా అనే కుమార్తె జన్మించింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలోకి మరో బుల్లి హిట్ మ్యాన్ వచ్చేశాడు. కొడుకు పుట్టిన ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్న రోహిత్ శర్మ ఈ సంతోషకరమైన వార్తను తొలిసారిగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక యానిమేటెడ్ ఫోటోను పంచుకున్న రోహిత్ శర్మ ‘మే నలుగురు అయ్యాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ యానిమేటెడ్ ఫోటోలో, ఒక జంట సోఫాలో కూర్చుని నవ్వుతూ కనిపించగా, ఒక చిన్న అమ్మాయి తన ఒడిలో నవజాత శిశువును పట్టుకుని కనిపించింది. రోహిత్ పోస్ట్‌ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రోహిత్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు డబ్ల్యూపీఎల్ కు, మరొకరు ఐపీఎల్ కు అంటూ రోహిత్ పోస్టుకు కామెంట్స్ ఇస్తున్నారు.

ముంబైలోని స్థానిక ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి రితికా ప్రసవించిన్లు తెలుస్తోంది. కాగా బిడ్డ కోసం ఎదురుచూస్తున్న రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ఇంకా 6 రోజులు ఉన్నాయి.. ఈ సందర్భంలో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ అతను తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకుంటే జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..