ICC Champions Trophy: పాక్‌కి షాకిచ్చిన ఐసీసీ.. పంతానికి పోతే ఇలాగే ఉంటుంది.!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ కొత్త షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. పీఓకేలో మ్యాచ్‌లు జరుపుతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ప్రకటించింది. అయితే దీనిపై బీసీసీఐ పాక్‌కు షాక్ ఇచ్చింది. పీఎంకేను కొత్త షెడ్యూల్‌లో జత చేయకపోవడం పాక్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరగనుండగా, ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటి మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే కవ్వింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి టోర్నమెంట్ ట్రోఫీ పీసీబీ షెడ్యూల్ ప్రకారం స్కర్డు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్, పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లో జరగాల్సి ఉంది. కానీ తాజాగా ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నగరాల్లో ట్రోఫీ పర్యటనను నిర్వహించే చర్యను బీసీసీఐ కార్యదర్శి జే షా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో PoKలో మ్యాచ్లు జరగడానికి PCBని అనుమతించడానికి ICC నిరాకరించింది. తాజాగా ICC కొత్త నగరాల పేర్లను ప్రకటించింది. ఈసారి ICC ఎంపిక చేసిన కొత్త నగరాల్లో PoK లోని ఏ నగరం కూడా లేదు. ICC కొత్త షెడ్యూల్ ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ నవంబర్ 16న ఇస్లామాబాద్, 17న తక్షిలా మరియు ఖాన్‌పూర్‌లో, నవంబర్ 18న అబోటాబాద్‌లో, నవంబర్ 19న ముర్రే, నవంబర్ 20న నాథియా గలీ, 22 నుంచి 25 వరకు కరాచీలో పర్యటించనుంది. ఇందులో భారత్ పేరు కూడా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ భారతదేశంలో 15 జనవరి నుండి 26 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చే పాకిస్తాన్‌లో పర్యటన కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్
16 నవంబర్ ఇస్లామాబాద్, పాకిస్తాన్
నవంబర్ 17 – తక్షిలా మరియు ఖాన్పూర్, పాకిస్తాన్
18 నవంబర్ అబోటాబాద్, పాకిస్తాన్
19 నవంబర్- ముర్రే, పాకిస్తాన్
20 నవంబర్- నథియా గాలి, పాకిస్తాన్
22 – 25 నవంబర్ – కరాచీ, పాకిస్తాన్
26 – 28 నవంబర్ – ఆఫ్ఘనిస్తాన్
10 – 13 డిసెంబర్ – బంగ్లాదేశ్
15 – 22 డిసెంబర్ దక్షిణాఫ్రికా
25 డిసెంబర్ 5 జనవరి ఆస్ట్రేలియా
6 – 11 జనవరి న్యూజిలాండ్
12 – 14 జనవరి ఇంగ్లాండ్
15 – 26 జనవరి భారతదేశం
జనవరి 27 నుంచి పాకిస్థాన్