AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamalini Mukherjee: ‘ఆనంద్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందా తెలుసా? అసలు ఊహించలేరు..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారు. అంతేకాదు హీరోతో సమానంగా కథానాయికకు ప్రాధాన్యమిస్తారు. అలా శేఖర్ కమ్ముల పరిచయం చేసిన అందాల తారల్లో కమలినీ ముఖర్జీ ఒకరు.

Kamalini Mukherjee: 'ఆనంద్' సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందా తెలుసా? అసలు ఊహించలేరు..
Kamalini Mukharjee
Basha Shek
|

Updated on: Nov 15, 2024 | 8:30 PM

Share

2004లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడులైన ఆనంద్ సూపర్ హిట్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్యాప్షన్ ‘ఒక మంచి కాఫీ లాంటి సినిమా’కు తగ్గట్టుగానే ఆనంద్ సినిమా నిజంగానే మనసుకు హత్తుకునే చిత్రం. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా.. కేవలం కథ, స్క్రీన్ ప్లేతోనే ఆనంద్ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో రాజా, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కమిలిని పోషించిన రూప పాత్ర సినీ ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పేరెంట్స్ ను పోగొట్టుకుని ఫ్రెండ్స్ సాయంతో జీవిస్తూ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రలో కమలినీ అద్భుతంగా నటించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. దీని తర్వాత శేఖర్ కమ్ముల సినిమా గోదావరితో కమలినీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో ఆమె పోషించిన సీతామహాలక్ష్మి పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంది. వీటి తర్వాత స్టైల్, క్లాస్ మేట్స్, హ్యాపీ డేస్, పెళ్లైంది కానీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి తదితర సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అయితే చాలామంది హీరోయిన్లలాగే ఒకానొక దశలో కమలినీ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో గోవిందుడు అందరివాడేలే, జగద్గురు ఆది శంకర వంటి చిత్రాల్లో సహాయక నటిగా కనిపించిందీ అందాల తార.

2016లో చివరిగా మన్యం పులి అనే సినిమాలో నటించింది కమలినీ ముఖర్జీ. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. దీని తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స తో టచ్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ అందాల తార ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆ మధ్యన తన సోదరీమణులతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది కమలిని. ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా గతేడాది డల్లాస్‌లో ఓ ఈ వెంట్‌కు హాజరైంది కమలిని ముఖర్జీ. అక్కడ ఆమెను చూసిన వారందరూ షాక్ అయ్యారు. సన్న జాజిలా ఉండే కాస్త బొద్దుగా మారడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. మరి చాలా మంది హీరోయిన్ల లాగానే ఈ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్స్ చేస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

గతేడాది డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్ లో కమిలినీ ముఖర్జీ..

Kamalini Mukharjee 1

Kamalini Mukharjee 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?