Aditi Sharma: ఉదయ్‌ కిరణ్‌ ‘గుండె ఝల్లుమంది’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ నటించిన ప్రేమకథా చిత్రాల్లో గుండె ఝల్లుమంది ఒకటి. 2008లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించకపోయినా యువతను బాగా అలరించింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఉదయ్ కిరణ్ కు జోడీగా అదితీ శర్మ నటించింది.

Aditi Sharma: ఉదయ్‌ కిరణ్‌ 'గుండె ఝల్లుమంది’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్
Aditi Sharma
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2024 | 8:19 PM

దివంగత హీరో ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే ఎక్కువగా నటించాడు. అలా అతను 2008లొ నటించిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అదితీ శర్మ నటించింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అయినా ఎంతో చక్కగా నటించిందీ అందాల తార. ఉదయ్‌కిరణ్‌కు పర్‌ఫెక్ట్‌ జోడీగా సూటయ్యింది. సినిమా ఫ్లాప్ అయినా అదితీ అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. గుండె ఝల్లు మంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి తప్పితే కమర్షియల్‌ గా విజయం సాధించ లేదు. దీని తర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు కరువయ్యాయి. ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నూ నటించింది. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ.

కాగా 2014లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ శర్మ. ఈ దంపతులకు 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత కేవలం పంజాబీ సినిమాలకే పరిమితమంది అదితి. అలాగే టీవీ షోస్ లోనూ మెరుస్తోంది. వీటితో పాటు తన భర్త బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తన భర్త, పిల్లాడికి సంబంధించిన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

భర్త, కుమారుడితో నటి అదితీ శర్మ..

తాజాగా అదితీకి సంబంధించిన ఫొటోలు కొన్ని నెటిజన్ల కంట పడ్డాయి. ఇందులో అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది అదితీ. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అమ్మయిన తర్వాత కూడా ఈ అమ్మడి అందం ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు. తెలుగులోనూ సినిమాలు చేయాలని పట్టు బడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.