AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసిన క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు లవర్‌తో ఎంగేజ్‌మెంట్.. గుర్తు పట్టారా?

ఒకటి లేదా రెండు సినిమాలు చేసినా కొందరు హీరోయిన్లు బాగా గుర్తుండిపోతుంటారు. ఈ క్రేజీ బ్యూటీ కూడా సరిగ్గా ఈ కోవకు చెందినదే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించింది కేవలం రెండు సినిమాలే. అవి కూడా ఫ్లాప్ లుగా నే మిగిలిపోయాయి.

ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసిన క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు లవర్‌తో ఎంగేజ్‌మెంట్.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 16, 2024 | 4:38 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. 2010లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం వదిలిపెట్టకుండా చూస్తున్నారు.ఇక ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ లవర్ రూబాగా మరో ముద్దుగుమ్మ నటించింది. ఆ హీరోయిన్ పేరు షాజన్ పదంసీ. ‘రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయిరబ్బా’ అని సినిమాలో రామ్ చరణ్ పాడినట్లే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది షాజన్. సినిమాలో ఆమె కనిపించేది కొద్ది సేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును కవ్వించింది. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆశిష్ కనాకియ అనే వ్యాపారవేత్తతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం తాము ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నామంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు షాజన్, ఆశిష్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ముంబైకి చెందిన షాజన్ పదమ్సీ.. 2009లో ‘రాకెట్ సింగ్’ హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాతి ఏడాది రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ మూవీ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత వెంకటేశ్-రామ్ ‘మసాలా’ సినిమాలోనూ నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మరో సినిమా ఛాన్స్ రాలేదు

ఆరెంజ్ హీరోయిన్ ఎంగేజ్ మెంట్ ఫొటోస్, వీడియోలు..

ఓవరాల్ సినిమా కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసింది షాజన్ పదమ్సీ. ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు ‘మూవీ మ్యాక్స్’ థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..