Tollywood: బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అద్దం ముందు పోజిచ్చిన ఈ వయ్యారీ ఎవరో తెలుసా?

సాధారణంగా మనం బంగరాన్ని ఆభరణాలుగా ఉపయోగించుకుంటాం. అయితే కొంత మంది గోల్డ్ ను వస్తువులుగా కూడా వినియోగించుకుంటారు. అలా తాజాగా ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా బంగారంతో చేసిన టూత్ బ్రష్ తో పోజులు ఇచ్చింది.

Tollywood: బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అద్దం ముందు పోజిచ్చిన ఈ వయ్యారీ ఎవరో తెలుసా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2024 | 8:12 PM

పై ఫొటోలో బంగారంతో చేసిన టూత్ బ్రష్ పట్టుకుని అద్దం ముందు పోజులిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అందం, అభినయంతో పాటు క్రేజ్ లోనూ బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ అసలు తగ్గదు. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ భర్త కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. త్వరలోనే ఈ అందాల తార ఒక పాన్ ఇండియా సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీగా ఉంది. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్..ఈ బంగారపు టూత్ బ్రష్ తో పోజులిస్తున్న వయ్యారి మరెవరో కాదు గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. వాష్‌రూమ్‌లో అద్దం ముందు బ్రష్‌ పట్టుకుని పోజులిస్తోన్న ఫొటోలను అందులో షేర్ చేసింది. అది మాములు బ్రష్ అయితే ఎవరూ పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదేమో? కానీ కియారా చేతిలో ఉన్నది బంగారపు టూత్‌ బ్రష్‌. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ నోరెళ్ల బెట్టారు.

ఈ ఫొటోలకు కియారా ఇచ్చిన క్యాప్షన్ కూడా చాలా క్రేజీగా ఉంది. ‘నోటితో మాట్లాడకుండా తాను సింధి అమ్మాయినని ఎలా చెప్తానో చూడు’ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. సాధారణంగా సింధి అమ్మాయిలు బంగారాన్ని విరివిగా వాడతారట. ఇప్పుడే ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది పోస్ట్. ప్రస్తుతం కియారా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

‘గోల్డెన్ ట్రూత్ బష్ చూస్తుంటే అసలు పండ్లు తోముకున్నట్లే లేదు.. ఊరికే షో ఆఫ్ కేనా’.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘కనీసం మూడు నెలలకొకసారైనా బ్రష్ మార్చాలంటారు.. మరీ నువ్వేం చేస్తున్నావ్‌? ఏళ్లతరబడి ఇదే బ్రష్ ను వాడుతున్నావా?’ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టాడు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ..

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..