ఇదేంది మావా ఇది.. ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!

ఇప్పుడంటే సహాయక పాత్రలు చేస్తున్నారు కానీ.. అప్పటిలో రమ్యకృష్ణ టాలీవుడ్‌ను దున్నేశారు. అప్పట్లో ఏ సినిమా చూసినా ఆమె హీరోయిన్ గా కనిపించేవారు. నటనతో పాటు తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కిర్రెక్కించారు.

ఇదేంది మావా ఇది.. ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!
Ramyakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2024 | 7:41 PM

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ముందువరసలో ఉండే పేరు మాత్రం రమ్యకృష్ణ. స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడంటే సహాయక పాత్రలు చేస్తున్నారు కానీ.. అప్పటిలో రమ్యకృష్ణ టాలీవుడ్‌ను దున్నేశారు. అప్పట్లో ఏ సినిమా చూసినా ఆమె హీరోయిన్ గా కనిపించేవారు. నటనతో పాటు తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కిర్రెక్కించారు. రమ్యకృష్ణ  తెలుగు, తమిళ్ కలిపి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించారు. అలాగే ఆమె కేరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అప్పటి యూత్ రమ్యకృష్ణ అంటే పడి చచ్చిపోయేవారు. కేవలం రమ్యకృష్ణను చూడటానికే సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రమ్యకృష్ణ. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇఅయితే రమ్యకృష్ణ ఓ నటుడికి కూతురిగా, చెల్లెలిగా, అలాగే భార్యగా కూడా నటించారని మీకు తెలుసా..? సినిమాల్లో ఇలాంటివి చాలా కామన్.. చాలా మంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో నటించిన వారు ఉన్నారు. అలాగే చెల్లెలిగా, ప్రియురాలిగా, భార్యగాను నటించిన వారు కూడా ఉన్నారు. అలాగే రమ్యకృష్ణ కూడా ఓ నటుడికి ఇలా కూతురిగా, చెల్లెలిగా, భార్య‌గా నటించి మెప్పించారు. ఆయన ఎవరో కాదు వర్సటైల్ నటుడు నాజర్.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

అవును నాజర్ తో రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించారు. తమిళ్ సినిమా వంత రాజవతాన్ వరువేన్ లో రమ్యకృష్ణ నాజర్ కూతురిగా నటించారు. అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో నాజర్ చెల్లెలు నీలాంబరిగా అద్భుతంగా నటించారు. అదేవిధంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర చేయగా ఆమె భర్త బిజ్జల దేవుడుగా నాజర్ నటించారు. ఇలా రమ్యకృష్ణ నాజర్ కు కూతురిగా, చెల్లిగా, అలాగే భార్యగా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ అమ్మగా, వదినగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

Actor Nassar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.