Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మెకానిక్ రాకీతో సందడి చేయనున్నాడు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..
Vishwak Sen
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2024 | 3:16 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మెకానిక్ రాకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మెకానిక్ రాకీతో సందడి చేయనున్నాడు. కాగా విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈనగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్.. వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు, ముఖ్యంగా యూత్ లో విశ్వక్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇది కూడా చదవండి : Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!

ఇక మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. శ్రద్దా శ్రీనాథ్ కోసం బెంగళూరు వరకు టికెట్ వేసుకొని వెళ్లి అప్పుడు ఫలక్ నామా దాస్ కథ చెప్తే ఆమె నో చెప్పింది. ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె .. అప్పటికి ఈనగరానికి ఏమైంది సినిమా కూడా చేయలేదు. అప్పుడు నేను చాలా లాస్ ఫీల్ అయ్యాను. అసలే డబ్బులు లేవు.. బెంగుళూరు వరకు టికెట్ పైసలు వెస్ట్ అయ్యాయి అని ఫీల్ అయ్యాను.. ఇప్పుడు తిరిగి ఆ అమ్మాయితో యాక్ట్ చేస్తుంటే కిక్ వచ్చింది” అని విశ్వక్ అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

కాగా మెకానిక్ రాకీ  సినిమాలో మీనాక్షి చౌదరి,  శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింమ్స్ ప్రేక్షకులను అలరించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విశ్వక్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం