- Telugu News Photo Gallery Cinema photos Music Director Thaman Intresting Comments On Allu Arjun Pushpa 2 Movie
Pushpa 2: పుష్ప 2 చూసి భయపడ్డాను.. అల్లు అర్జున్ గురించి తమన్ కామెంట్స్..
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా..ఇటీవలే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా పలువురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.
Updated on: Nov 16, 2024 | 2:06 PM

పుష్ప 2 చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశ పనులు పుల్ స్వింగ్ లో ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా మరికొందరు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారు.

రాజమౌళి, ప్రశాంత్ వర్మ, నాగవంశీ.. ఒక్కరా ఇద్దరా.. సెలబ్రిటీలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పుష్పరాజ్ హార్డ్ వర్క్ ని. ఈ రేంజ్ భారీతనం ఉన్నప్పుడు.. సుక్కు మల్టిపుల్ మ్యూజిక్ డైరక్టర్స్ ని హయర్ చేసి, వర్క్ షేర్ చేయడంలో తప్పేం లేదనే మాట వినిపిస్తోంది.

ఈ మూవీ వచ్చిన తర్వాత అవార్డులన్నీ బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయని.. పదిహేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారని.. అది సాధ్యం కాదని అన్నారు. అందుకే తనకున్న టైంలో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసి ఇచ్చానని అన్నారు.

ట్రైలర్‌లో మీరు విన్న ప్రతి బిట్ ఆర్ ఆర్ నాదేనని గట్టిగానే చెప్పేశారు దేవిశ్రీ ప్రసాద్. పుష్పరాజ్ సిల్వర్‌స్క్రీన్స్ మీద చేయబోయే మేజిక్ కోసం వెయిట్ చేయండి.. అంటూ ఊరిస్తున్నారు మేకర్స్.

డిసెంబర్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.




