- Telugu News Photo Gallery Cinema photos Do You Know Lavanya Tripathi Was Acted Friend, Lover and Mother Roles Naga Chaitanya
Naga Chaitanya: నాగచైతన్యకు ఫ్రెండ్‌గా, లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Updated on: Nov 16, 2024 | 12:34 PM

అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు నాగ చైతన్య. మొదటి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు చైతూ. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే వరుస సినిమాలతో అలరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు చైతూ ఖాతాలో సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ తండేల్ చిత్రంపైనే ఉన్నాయి. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతూ. కానీ మీకు ఓ విషయం తెలుసా.. ? సినీరంగంలోని ఓ హీరోయిన్ చైతుకు స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా, తల్లిగా కనిపించింది.

తను మరెవరో కాదండి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం చిత్రంలో చైతూకు స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి యుద్ధం శరణం అనే సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇక సూపర్ హిట్ బంగార్రాజు సినిమాలో చైతూను నాగార్జున, లావణ్య దంపతుల కొడుకుగా చూపించారు. అంటే.. ఇందులో చైతూకు తల్లిగా లావణ్య త్రిపాఠి అని అర్థం. అలా చైతుకు ఫ్రెండ్, లవర్, తల్లిగా కనిపించింది లావణ్య.




