- Telugu News Photo Gallery Cinema photos Fans Confusion on pawan kalyan Ustaad bhagat singh Script Issue with Director Harish Shankar
Ustaad Bhagat Singh: నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతున్న పవర్‌స్టార్ పేరు.! రాజకీయాల్లో కాదు..
పవర్‌స్టార్ పేరు నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతోంది. నిన్నటిదాకా సెట్స్ మీదున్న ఆయన సినిమాలతో ముడిపెట్టి ట్రోల్ చేస్తే, ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లకుండా బ్రేక్‌లో ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. మీకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటుందిగా.. ఓజీ ఓజీ అని అరిస్తే ఏం వస్తుంది.. దానికి బదులు భగవన్నామస్మరణ చేయండి అంటూ పవర్‌స్టార్ చెప్పిన మాటలను వైరల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
Updated on: Nov 16, 2024 | 12:12 PM

పవర్‌స్టార్ పేరు నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతోంది. నిన్నటిదాకా సెట్స్ మీదున్న ఆయన సినిమాలతో ముడిపెట్టి ట్రోల్ చేస్తే,

ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లకుండా బ్రేక్‌లో ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. మీకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటుందిగా..

ఓజీ ఓజీ అని అరిస్తే ఏం వస్తుంది.. దానికి బదులు భగవన్నామస్మరణ చేయండి అంటూ పవర్‌స్టార్ చెప్పిన మాటలను వైరల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

మీ సినిమా చూస్తే చాలు బాస్ అంటూ సమాధానం చెబుతున్నారు. అంతే కాదు.. గబ్బర్‌సింగ్ కాంబో గురించి కూడా పనిలో పనిగా ఆరా తీస్తున్నారు.

గబ్బర్‌సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్ వస్తుందని తెలియగానే పక్కా కమర్షియల్ హిట్ అని అనుకున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలోనూ హల్ చల్ చేసింది ఉస్తాద్ భగత్‌సింగ్.

కదలిక అంటూ మొదలైతే.. వీరమల్లు తర్వాత క్యూలో ముందుకు జరిగే మూవీ ఓజీ యేగా.. అని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు.

దానికి తగ్గట్టు మొత్తం చేంజ్ చేసే పనిలో ఉన్నారట హరీష్. ఇటీవల పవర్‌స్టార్‌ని కలిసి అదే విషయాన్ని చెప్పారట ఈ కెప్టెన్. ఆల్రెడీ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయ్యాక ఉస్తాద్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేద్దామని అన్నారట పవర్‌స్టార్. సో.. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకుంటోంది టీమ్.




