AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

ఈ మధ్య హీరోల కంటే ఆ సినిమాల్లో నటించిన విలన్స్ కే క్రేజ్ పెరుగుతుంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న విలన్ ఒకరు. ఆ స్టైలిష్ విలన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు హీరోగా సూపర్ సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఆయనే వినయ్ రాయ్.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు
Vinay Rai
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 8:17 PM

Share

చాలా మంది హీరోలు విలన్స్ గా మారి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అదేంటో హీరోలుగా రాని ఇమేజ్ ను విలన్స్ గా సాదించుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు విలన్స్ గ క్లిక్ అయ్యారు. ఈ మధ్య హీరోల కంటే ఆ సినిమాల్లో నటించిన విలన్స్ కే క్రేజ్ పెరుగుతుంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న విలన్ ఒకరు. ఆ స్టైలిష్ విలన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు హీరోగా సూపర్ సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఆయనే వినయ్ రాయ్. 2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వినయ్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. నీవల్లే నీవల్లే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. వాన సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

ఆతర్వాత తమిళ్ లోనే వరుసగా సినిమాలు చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు. వరుణ్‌ డాక్టర్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్నాడు వినయ్ రాయ్. ఇదిలా ఉంటే ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఆమె మన టాలీవుడ్ హీరోయిన్. వినయ్ రాయ్ విమలా రామన్ తో డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ తెగ ఫోటోలు షేర్ చేస్తున్నారు.  టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో ఎవరైనా ఎప్పుడేనా, జగపతి బాబుతో ‘గాయం 2’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది. అలాగే నువ్వా నేనా సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో కనిపించింది. ఇదిలా ఉంటే విమలా రామన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రుద్రాంగి, గాండీవ దారి అర్జున సినిమాలో కనిపించింది. గాండీవ దారి అర్జున సినిమాలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్య భర్తలుగా నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసున్నా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us