PM Narendra Modi: ‘ అసలు నిజం బయటకు వస్తోంది’.. రాశీఖన్నా సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు
12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా నటించిన ఓ సినిమాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కల్పిత కథనాలు ఎల్లకాలం దాగవని, నిజాలు బయటకు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా విడుదలైంది . ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. శుక్రవారం (నవంబర్ 15)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మోడీ.. ‘కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
2002 గోద్రా రైలు ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత గుజరాత్ లో మతకల్లహాలు చెలరేగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడిదే ఘటన ఆధారంగా ది సబర్మతీ రిపోర్ట్ ను తెరకెక్కించారు ధీరజ్ శర్మ. నవంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీనే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది.
ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
— Narendra Modi (@narendramodi) November 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.