AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bagheera OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బఘీర’.. ఎక్కడ చూడొచ్చంటే?

కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు అతను ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ ఒక పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కథ అందించాడు. అదే బఘీర.

Bagheera OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'బఘీర'.. ఎక్కడ చూడొచ్చంటే?
Bagheera Movie
Basha Shek
|

Updated on: Nov 20, 2024 | 6:54 PM

Share

ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు శ్రీ మురళి. ఇక స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైపోయింది రుక్మిణీ వసంత్. వీరిద్దరూ జంటగా నటించిన తాజా చిత్రం బఘీర. డాక్టర్. సూరి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందించడం విశేషం. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్గుగానే సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో బఘీరాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టే దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ పాన్ ఇండియా సినిమా రిలీజైంది. కానీ అంచనాలు అందుకోలేక చతికిలపడింది. కేజీఎఫ్, సలార్ సినిమాల్లాగానే యాక్షన్ కు పెద్ద పీట వేయడం, పెద్దగా కథ లేకపోవడంతో బఘీరా సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కన్నడలో ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినా తెలుగులో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దీనికి తోడు క, అమరన్, లక్కీ భాస్కర్ పోటీలో ఉండడంతో బఘీరా పక్కకు వెళ్లిపోయింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోని ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బఘీరా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచే బఘీరా సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే బఘీరా సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

కేజీఎఫ్, సలార్, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బఘీరా సినిమాను నిర్మించింది. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సుధా రాణి, అచ్యుత్ కుమార్, రామచంద్ర రాజు, రంగాయన రఘు, ప్రమోద్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ పాన్ ఇండియా సినిమాను మిస్ అయ్యారా? యాక్షన్ సినిమాలు, సూపర్ హీరో మూవీస్ ఇష్టపడేవారు బఘీరాపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

బఘీరా తెలుగు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ