Ram Charan: రామ్ చరణ్, జాన్వీల ఆర్‌సీ16 షూటింగ్ షురూ.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమాలో తన షూట్ పార్ట్ ను కంప్లీట్ చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్న చరణ్ మరోవైపు తన తదుపరి సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Ram Charan: రామ్ చరణ్, జాన్వీల ఆర్‌సీ16 షూటింగ్ షురూ.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడంటే?
Ram Charan, Janhvi Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2024 | 9:09 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. అయితే ఈలోగానే రామ్ చరణ్ మైసూర్ వస్తున్నాడు. రామ్ చరణ్ మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ కూడా అతనితో కలిసి మైసూర్ రాననుంది. ఇక కన్నడ సూపర్ స్టార్ శివన్న వీరితో కలవనున్నారు. రామ్ చరణ్, జాన్హవి కపూర్ సినిమా షూటింగ్ కోసం మైసూర్ వస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న ఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ మైసూరులో ప్రారంభం కానుంది. ఇది మొదటి షెడ్యూల్. ఈ సినిమా షూటింగ్ లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొననున్నాడు. మైసూరులోని కొన్ని పురాతన భవనాలు, మైసూరు శివార్లలోని అటవీ ప్రాంతాల్లో రామ్ చరణ్ సినిమా చిత్రీకరణ జరుపనున్నారు.

ఉప్పెన తో అందరి దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు సనా ఆర్ సీ 16 సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా చాలా కాలం పనిచేశాడు బుచ్చిబాబు. ఈ క్రమంలోనే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా మైసూర్‌లో సినిమా షూటింగ్‌ని ముగించుకుని శివరాజ్‌కుమార్‌ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. శివన్న ఆరోగ్య సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నవంబర్ 22న రామ్ చరణ్-జాన్వీ మైసూర్ రానున్నారు, అదే రోజున షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు రెండు వారాల పాటు మైసూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇక జాన్వీ కపూర్‌కి ఇది రెండో తెలుగు సినిమా. ఇటీవల ఆమె నటించిన ‘దేవర’బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శివరాజ్ కుమార్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.