Tollywood : ఈ స్టార్ కపుల్స్‌కి ఏమైంది..? పెళ్లిళ్లా.. పేకమేడలా..! ఇండస్ట్రీలో కటీఫ్ కహానీలూ..
సినిమా సంగీత ప్రపంచంలో జగజ్జేత.. ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఇంటిగుట్టు రట్టయ్యి.. బైటికి మొహం చూపించుకోలేని సిట్యువేషన్లో పడ్డారు. ఐదు పదులు దాటినా.. రాత్రి 12 గంటలకు బైక్ మీద లాంగ్ రైడ్లు వెళ్లే ఈ లవబుల్ పెయిర్ ఇప్పుడు సడన్‌గా బ్రేకప్ ఐంది.
తెర మీద ఎంతటి స్టార్లయినా కావొచ్చు.. మేకప్పు తీస్తే మాత్రం వాళ్లవి కూడా మామూలోళ్లకొచ్చే సినిమా కష్టాలే. స్టార్ కపుల్స్ కాపురాలైతే ఏ క్షణంలో ఐనా కూలిపోడానికి సిద్దంగా ఉండే పేకమేడలే. పెళ్లప్పుడు చిలకా గోరింకల కంటే చిక్కటి ప్రేమలు ఒలకపోసుకున్నా.. కాపురం మొదలుపెడితే మాత్రం కటీఫ్ కహానీలూ.. యాంటీ క్లయిమాక్స్లే. ఏ కొందరికి మాత్రమే ఇక్కడ మినహాయింపు. లేటెస్ట్గా మావిడాకుల సీక్వెన్స్‌లో ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కపుల్.. అస్కార్ విన్నర్ రెహమాన్ అండ్ హిజ్ బెటర్ హాఫ్ సైరాబాను. ఈ స్టార్ కపుల్స్‌కి ఏమైందసలు..?
సినిమా సంగీత ప్రపంచంలో జగజ్జేత.. ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఇంటిగుట్టు రట్టయ్యి.. బైటికి మొహం చూపించుకోలేని సిట్యువేషన్లో పడ్డారు. ఐదు పదులు దాటినా.. రాత్రి 12 గంటలకు బైక్ మీద లాంగ్ రైడ్లు వెళ్లే ఈ లవబుల్ పెయిర్ ఇప్పుడు సడన్‌గా బ్రేకప్ ఐంది. మా పెళ్లి కథకు ఇక్కడితో ఫుల్స్టాప్.. ఇకపై మేమిద్దరం ఎవరికివారే యమునాతీరే.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏఆర్ రెహమాన్ అండ్ హిజ్ వైఫ్ సైరాబాను. వీళ్లిద్దరూ పరస్పర అంగీకారంతోనే వీడిపోతున్నారు.. అంటూ వాళ్ల లాయర్ లాయర్ వందనా షా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ”ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉంది.. వారి బంధంలో ఎమోషనల్ ప్రెజర్స్ చాలా ఉన్నాయి. అందుకే ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారు”.. అనేది వీళ్ల విడాకుల పత్రం సారాంశం.
బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
దీంతో.. 29 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్టయింది. 1995లో పెళ్లి చేసుకున్న రెహమాన్, సైరాబాను దంపతులకు ముగ్గురు పిల్లలు. ఖతీజా, రహీమా, అమీన్. మాది లవ్ మారేజ్ కాదు.. ఎరేంజ్డ్ మేరేజ్.. మా అమ్మ చెప్బబట్టే సైరాను పెళ్లాడా అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రెహమాన్. ”30వ పెళ్లిరోజు కోసం ఆశగా ఎదురుచూశా.. కానీ.. మా హృదయాలు విరిగిపోయాయి. పగిలిన ముక్కలు మళ్లీ అతుక్కోలేవు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి” అని సోషల్ మీడియాలో అప్పీల్ చేసుకున్నారు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్. మా అమ్మానాన్నల మధ్య అభిప్రాయ బేధాలొచ్చినా.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు అందరికీ థ్యాంక్స్.. మమ్మల్ని కూడా ఇలా వదిలేయండి.. అంటూ రెహమాన్ పిల్లలు కూడా వేడుకున్నారు.
మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
కానీ.. దాదాపు ముప్పై ఏళ్లు కలిసున్నాక.. ముగ్గురు పిల్లలు పుట్టాక.. బైటి ప్రపంచానికి బెస్ట్ కపుల్‌గా పేరు బడ్డాక.. ఇప్పుడు తమ ఆరాధ్య సంగీతకారుడి దంపతులు ఇలా విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమేరకు సోషల్ మీడియాలో డీప్ ఎమోషన్లతో పోస్టులు ట్రెండవుతున్నాయి. కానీ.. సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులవడం సినిమా ఫీల్డులో కొత్తేమీ కాదు. సౌత్ సినిమాలో విడాకుల దాకా వెళ్లిన స్టార్ ఫ్యామిలీలు చాలానే ఉన్నాయి. గ్రేట్ ఎగ్జాంపుల్ మన టాలీవుడ్లోనే ఉంది. సమంత- నాగచైతన్య. ఏం మాయ చేశావె అంటూ స్క్రీన్ ప్రెజన్స్లోనే కాదు.. పర్సనల్ లైఫ్‌లో కూడా ఆదర్శ దంపతుల్లా కనిపించిన సామ్ అండ్ చైతూ.. సరిగ్గా నాలుగేళ్ల కాపురం తర్వాత విడిపోయారు. కంబైన్డ్ మజిలీకి ముగింపు పలికి.. ఎవరి జిందగీల్ని వాళ్లు లీడ్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఐతే.. పెళ్లయ్యాక బ్రేకప్ చెప్పడం చాలాచాలా సింపుల్‌గా మారింది.
ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!
జయం ఫేమ్ రవి.. ఆర్తి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా.. పదిహేనేళ్ల కాపురం తర్వాత కటీఫ్ చెప్పుకున్నారు. భార్య భర్తపై డామినేషన్ చేసేదని, అమ్మ మాటను గుడ్డిగా ఫాలో ఔతూ.. తనకు తానే కాపురంలో నిప్పులు పోసుకుందని జయం రవి ఫ్యాన్స్ ఆర్తిని ఇప్పటికీ ఆడిపోసుకుంటారు. కొలవెరి కుర్రాడు ధనుష్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లాడినప్పుడు.. అతడి స్టార్డమ్ రెట్టింపయింది. మనోడికి తిరుగులేదని ఫ్యాన్స్ కూడా కాలరెగరేశారు. కానీ.. ఐశ్వర్యకూ నాకూ పడ్డం లేదు అంటూ విడాకులకు అప్లయ్ చేసి సింగిల్‌గా మారిపోయాడు ధనుష్. రజనీకాంత్ మరో కుమార్తె సౌందర్య కూడా తన భర్త అశ్విన్ రామ్‌కుమార్‌కి దూరంగా ఉన్నట్టు టాకుంది. తెలుగు సినిమాక్కూడా బాగా పరిచయమున్న మరో సౌతిండియన్ అమ్మాయి అమలాపాల్ కూడా.. రైటర్ కమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను పెళ్లి చేసుకుని… మనస్పర్థలొచ్చి విడిపోయింది. ఇలా వెండితెర వెనుక మావిడాకులు సినిమా ఆడుతూనే ఉంది. ఈ స్టార్ కపుల్స్‌కి ఏమైంది? అని షాకౌతుండగానే.. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దంపతుల రూపంలో మరో బ్రేకప్ న్యూస్. చూడముచ్చటైన జంటల కాపురాలన్నీ ఇలా.. చీలికలొచ్చి చిన్నాభిన్నం అవుతుంటే.. వాళ్ల సంగతేమోగాని.. అభిమానుల గుండెలు బరువెక్కిపోతున్నాయ్..!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..