- Telugu News Entertainment Tollywood Do you remember who is the heroine in this picture. She is Kantara movie actress Sapthami Gowda
పెళ్లైన హీరోతో ఆ యవ్వారం.. కట్ చేస్తే కోర్టు మెట్లెక్కిన యంగ్ బ్యూటీ
పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. కట్ చేస్తే కోర్టు మెట్లెక్కింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ చాలా పాపులర్ హీరోయిన్. కేవలం టాలీవుడ్ భామలే కాదు ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు..
Updated on: Nov 19, 2024 | 8:07 PM

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు కాంట్రవర్సిలతోను ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే కొంతమంది లవ్ ఎఫైర్స్ తో.. ప్రేమలు, బ్రేకప్స్, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. పెళ్లైన హీరోతో ఆ యవ్వారం నడిపింది.

పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. కట్ చేస్తే కోర్టు మెట్లెక్కింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ చాలా పాపులర్ హీరోయిన్. కేవలం టాలీవుడ్ భామలే కాదు ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు కూడా మన దగ్గర మంచి క్రేజ్ సొంతం ఆ కోవకు చెందిన భామే ఈమె.

ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ సప్తమీ గౌడ. కాంతార సినిమాతో పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే సప్తమీ గౌడ తన భర్తతో ఎఫైర్ పెట్టుకుంది అని ఓ హీరో భార్య ఆరోపించింది. గతంలో కన్నడ హీరో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది.

ఆమె విదేశాల్లో ఉన్నప్పుడు యువరాజ్, సప్తమీ గౌడ కలిసి జీవించారని ఆమె ఆరోపించింది. ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది.సప్తమి గౌడ కోసం నన్ను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది.

దీని పై సప్తమి సీరియస్ అయ్యింది. సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. ఈ వ్యవహారం అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపింది.




