Renu Desai: రేణూ దేశాయ్ తల్లి కన్నుమూత.. కన్నీరుమున్నీరవుతోన్న నటి

ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ నే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు రేణూ దేశాయ్‌ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు. 

Renu Desai: రేణూ దేశాయ్ తల్లి కన్నుమూత.. కన్నీరుమున్నీరవుతోన్న నటి
Renu Desai
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 8:50 PM

ప్రముఖ నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. తన తల్లికి సంబంధించిన పాత ఫొటోను అందులో షేర్ చేసిన రేణూ దేశాయ్ ఒక శ్లోకాన్ని అందులో జత చేసింది. పునరపి జననం పునరపి మరణం..పునరపి జననీ జఠరే శయనం.. ఇహ సంసారే బహుదుస్తారే..కృపయాపారే పాహి మురారే.. మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదు’ అంటూ ఆది శంకరాచార్యుల చెప్పిన మాటలను తన పోస్టులో పొందుపరిచింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో రేణూ దేశాయ్ కు ధైర్యం చెబుతున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటోంది రేణూ దేశాయ్. తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాగోగులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. అదే సమయంలో  సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోంది.  ముఖ్యంగా అనాథ పిల్లలు, మూగ జీవాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటుంది. అలాగే తన సోషల్ మీడియా ఫాలో వర్స్ ను, అభిమానులను ఈ మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే అడివిశేష్, ఉపాసన లాంటి సినీ ప్రముఖులు కూడా ఉపాసనకు సహాయం అందజేస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే తన కూతురు ఆద్య పేరు మీదుగా శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ అనే ఎన్జీవోను ప్రారంభించిందీ అందాల తార. మూగ జీవాల సంరక్షణ కోసం ఈ ఎజ్జీవోను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్..

కూతురు ఆద్యతో రేణూ దేశాయ్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.