Manchu Lakshmi: మళ్లీ అదరగొట్టిన మంచు లక్ష్మి.. కూతురితో కలిసి ఎనర్జిటిక్ డ్యాన్స్.. వీడియో ఇదిగో

సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది.

Manchu Lakshmi: మళ్లీ అదరగొట్టిన మంచు లక్ష్మి.. కూతురితో కలిసి ఎనర్జిటిక్ డ్యాన్స్.. వీడియో ఇదిగో
Manchu Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 7:33 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొంత కాలంగా వాటికి దూరంగా ఉంటోంది. పైగా తన నివాసాన్ని ముంబైకు షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా అక్కడే ఉంటోంది. అయితే ఈ మధ్య కాలంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచు లక్ష్మి పేరు బాగా వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడుల బాగు కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తోందామె. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలిగా పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి ఆ పాఠశాలల్లో డిజిటల్ స్మార్ట్ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ తరగతులను మంచు లక్ష్మి ప్రారంభించింది.

ఇక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది మంచు వారమ్మాయి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను అందులో షేర్ చేస్తోంది. ఇక ఆ మధ్యన ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కు స్టెప్పులేసిన మంచు లక్ష్మి తాజాగా మరోసారి కాలు కదిపింది. ఈసారి ఆమె కూతురు ఆపిల్ (ముద్దుపేరు) కూడా జత కలిసింది. ఒక ఇంగ్లిష్ ర్యాప్ సాంగ్ కు వీరిద్దరూ కలిసి డ్యాన్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇందులో మంచు లక్ష్మి కూతురు సైతం తన తల్లికి ఏమాత్రం తీసుకుపోకుండా ఎనర్జిటిక్ గా డాన్స్ వేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

మంచు లక్ష్మి డ్యాన్స్ వీడియో.. ఇదిగో..

ఇక మంచు లక్ష్మి కూతురు తరచూ డ్యాన్స్ క్లాస్ లకి వెళుతుంటుంది. చదవుతో పాటు మిగతా వాటిలో కూడా ఆపిల్ చాలా చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో పద్యాలు చెప్తూ, పాటలు పాడుతుంది.

అమృత్ సర్ స్వర్ణ దేవాలయం దగ్గర మంచు లక్ష్మి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.