Pushpa 2 Promotion: పుష్ప 2 ప్రమోషన్స్.. అందర్నీ మడతెట్టడమే మిగిలిందిక..!

మరీ ముఖ్యంగా దేశం మొత్తాన్ని జల్లెడ పట్టాలని ఫిక్సైపోయాడు పుష్ప రాజ్. ఉన్న తక్కువ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ టూర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప 2 టీం. దీనికి బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సుకుమార్ వచ్చినా రాకున్నా..

Pushpa 2 Promotion: పుష్ప 2 ప్రమోషన్స్.. అందర్నీ మడతెట్టడమే మిగిలిందిక..!
Pushpa 2
Follow us
Praveen Vadla

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 21, 2024 | 7:31 PM

పుష్ప పుష్ప పుష్ప.. పాటలో చెప్పినట్లు ఇప్పుడెక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. మరో 10 రోజుల్లోనే సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్ విషయంలో అస్సలు తగ్గేదే లే అంటున్నాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా దేశం మొత్తాన్ని జల్లెడ పట్టాలని ఫిక్సైపోయాడు. ఉన్న తక్కువ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ టూర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప 2 టీం. దీనికి బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సుకుమార్ వచ్చినా రాకున్నా.. తాను మాత్రం ప్రతీ చోటికి వెళ్లాలని ఫిక్సైపోయాడు. ఈ క్రమంలోనే మొదటి అడుగు బీహార్ నుంచి పడింది. పాట్నా ఈవెంట్ బ్లాక్‌బస్టర్ కావడంతో.. అదే ఊపులో మరో మూడు నాలుగు ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

నవంబర్ 24న చెన్నైలో ఓ భారీ వేడుక చేయబోతున్నారు. పుష్ప 2 సినిమాపై తమిళంలోనూ మంచి అంచనాలున్నాయి. మూడేళ్ళ కింద పుష్ప అక్కడ 17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు బిజినెస్సే 18 కోట్లకు పైగా జరిగింది. దాంతో కనీసం 50 కోట్లు వసూలు చేయాలని కాన్సట్రేడ్ చేసాడు బన్నీ. అందుకే తమిళనాడు మార్కెట్‌పై కూడా బాగానే ఫోకస్ చేసారు. మరోవైపు తన రెండో ఇంటిగా భావించే కేరళలోనూ భారీ ఈవెంట్‌నే ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. నవంబర్ 27న కేరళ వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా అదిరిపోయే మాస్ ఈవెంట్ చేయబోతున్నారు. అల్లు అర్జున్‌కు ముందు నుంచి కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆర్య నుంచి మొన్నటి పుష్ప వరకు అక్కడ ఆయన సినిమాలు అదిరిపోయే వసూళ్లు తెచ్చుకున్నాయి. అక్కడి యంగ్ హీరోలకు కూడా లేని క్రేజ్ అల్లు అర్జున్‌కు ఉంది. అందుకే సరదాగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అక్కడి ఆడియన్స్.

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

ఇక నవంబర్ 30న ముంబైలోనూ ఓ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. హిందీలో పుష్ప 2పై ఉన్న అంచనాలు చూస్తుంటే ఒక్క రికార్డు కూడా మిగిలేలా కనిపించడం లేదు. మొదటి రోజే అక్కడ కనీసం 70 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకునేలా కనిపిస్తుంది పుష్ప 2. ఇదే జరిగితే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే. అన్నీ పూర్తయ్యాక.. చివరగా డిసెంబర్ 2 లేదంటే 3న హైదరాబాద్‌లో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా నెక్ట్స్ 10 రోజులకు సరిపోయే ప్లాన్ అంతా సిద్ధం చేసి పెట్టుకున్నారు పుష్ప 2 టీం. చూడాలిక.. ఇదే ప్లాన్ సక్రమంగా అప్లై అవుతుందో లేదో..?

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!