నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు

చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. హీరోల పక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులకు పరిచయమైనా అతను.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్నాడు.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2024 | 6:11 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. హీరోల పక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులకు పరిచయమైనా అతను.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక మరో విశేషం ఏంటంటే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య పక్కన ఫ్రెండ్ గా నటించిన అతను.. ఆతర్వాత హీరోగా మారి చై కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.? వైవిధ్యమైన కథలకు అతను కేరాఫ్ అడ్రస్.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

చాలా మంది నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తే సుహాస్. సినిమాల్లోకి రాక ముందుసుహాస్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించాడు. ఇక శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. ఆతర్వాత నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలోనూ హీరో ఫ్రెండ్ పాత్రలోనే కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇక సుహాస్ హీరోగా నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. కాగా సుహాస్ నాగ చైతన్యతో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. ఇప్పుడు చైతన్య కంటే సుహాస్ ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య ఇప్పటివరకు 24 సినిమాలు చేయగా సుహాస్ ఇప్పటికే 22 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. ఇటీవలే జనకా అయితే గనక సినిమాలో నటించాడు. అలాగే సుహాస్ నటించిన గొర్రె పురాణం సినిమా కూడా ఓటీటీలో ఆకట్టుకుంటుంది.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..