- Telugu News Photo Gallery Cinema photos Have You Seen Tollywood Actres Sridevi Vijaykumar Family, Her Daughter Latest Photos Go Viral
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! లేటెస్ట్ ఫొటోస్ వైరల్
ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీదేవి విజయ కుమార్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. అయితే ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది.
Updated on: Nov 20, 2024 | 8:26 PM

తమిళంలో పలు హిట్ సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది శ్రీదేవి విజయ్ కుమార్. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ తోనే శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, ఆది లక్ష్మి, నిరీక్షణ, పెళ్లి కాని ప్రసాద్, మంజీర, సెల్ ఫోన్, వీర తదితర తెలుగు సినిమాల్లో నటించింది.

కొన్ని తమిళ్, కన్నడ సినిమాల్లోనూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ 2016 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.

పెళ్లి కావడం, ఆ తర్వాత వెంటనే బిడ్డకు జన్మనివ్వడంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది శ్రీదేవి.

అయితే ఇప్పుడు నారా రోహిత్ సుందర కాండ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే కొన్ని టీవీ రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది

సినిమాల సంగతి పక్కన పెడితే.. శ్రీదేవి భర్త, కూతురు పెద్దగా బయట కనిపించరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫ్యామిలీ ఫొటోస్ బోలెడు ఉన్నాయి.




