Ananyaa: జర్నీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

కొందరు హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో మెరిసి సడెన్ గా మాయమైపోతుంటారు. పెళ్లి, పిల్లలు అంటూ ఇండస్ట్రీకి క్రమంగా దూరమై పోతారు. జర్నీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అనన్య కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Ananyaa: జర్నీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Actress Ananya
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 7:00 PM

2011లో విడుదలైన జర్నీ సూపర్ హిట్ గా నిలిచింది. శరవణన్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించారు. సురేష్ కొండేటి నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ తమిళ చిత్రం తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులోని పాత్రలు కూడా ఎంతో సహజంగా ఉంటాయి. అంజలి, శర్వానంద్ ల ఎవర్ గ్రీన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది శర్వానంద్ లవర్ గా నటించిన అనన్య. అమృత అనే అమాయక అమ్మాయి పాత్రలో అనన్య అభినయం అందరినీ ఆకట్టుకుంది. అయితే జర్నీ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ అందాల తార. అమాయకుడు, అఆ, మహర్షి సినిమాల్లో సహాయక నటిగా మెప్పించిన అనన్య ఆ తర్వాత మరే తెలుగు మూవీలోనూ కనిపించలేదు. దీంతో తన దృష్టిని పూర్తిగా మలయాళ సినిమాలకే కేంద్రీ కరించింది. అనన్య అసలు పేరు ఆయిల్య గోపాలకృష్ణన్. 1995 లో ‘బ్రదర్స్’ అనే మలయాళ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2008 ‘పాజిటివ్’ అనే మళయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక జర్నీ సినిమాతో తెలుగు వారికి చేరువైన అనన్య పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే 2012 లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లాడింది అనన్య. ఆ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. కేవలం మలయాళ సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే, మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మలయాళ సినిమాలకే పరిమితం..

View this post on Instagram

A post shared by Ananyaa (@ananyahere)

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనన్య. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. అయితే జర్నీ సినిమాలో అమాయకంగా కనిపించిన అనన్య ఇప్పుడు ట్రెండీ దుస్తుల్లోనూ తళుక్కుమంటోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ట్రెడిషినల్ శారీలో జర్నీ హీరోయిన్ ..

ట్రెండీ దుస్తుల్లో నటి అనన్య..

View this post on Instagram

A post shared by Ananyaa (@ananyahere)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి