Dhanush-Nayanthara: ఒకే పెళ్లి వేడుకలో ధనుష్, నయనతార.. పక్కపక్కనే కూర్చున్నా… వీడియో ఇదిగో

నయనతార తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' 'సినిమా విజువల్స్ ఉపయోగించడంపై వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విషయమై నయన తార, ధనుష్ ల మధ్య వార్ నడుస్తోంది. అయితే ఈ వివాదం జరుగుతుండగానే ఒకే పెళ్లి వేడుకలో ప్రత్యక్షమయ్యారీ స్టార్ యాక్టర్స్.

Dhanush-Nayanthara: ఒకే పెళ్లి వేడుకలో ధనుష్, నయనతార.. పక్కపక్కనే కూర్చున్నా... వీడియో ఇదిగో
Nayanthara , Dhanush
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 9:38 PM

స్టార్ నటులు ధనుష్, నయన తారల వివాదం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ తో ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్ నిర్మాణ సారథ్యంలో నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ నయన తారకు లీగల్‌ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదం కొనసాగుతోన్న సమయంలోనే ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ధనుష్, నయనతార ఇద్దరూ ఒకే వేదికపై మెరిశారు. తమిళ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్‌ పెళ్లికి ధనుష్, నయన తార హాజరయ్యారు. వేడుకగా భాగంగా పక్క పక్కనే కూర్చున్నప్పటికీ ఎడ మొహం, పెడ మొహంగానే కనిపించారీ స్టార్స్. కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా.

ఇదే పెళ్లి వేడుకకు నయన తార భర్త విఘ్నేశ్ శివన్, శివ కార్తికేయన్, అనిరుధ్ తదితర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా నయనతార నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌ డాక్యుమెంటరీలో నయన తారతో కలిసి పనిచేసిన నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో నయన తార డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో నయన తార, ధనుష్.. వీడియో ఇదిగో..

నెట్ ఫ్లిక్స్ లో నయన్ డాక్యుమెంటరీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.