AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‌లోకి టీమిండియా క్రికెటర్ భార్య.. ఆ యంగ్ హీరోతో కలిసి సినిమా

భారత క్రికెట్ జట్టు ఆటగాడు, RCB మాజీ ప్లేయర్ భార్య ఇప్పుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. అది కూడా ఓ తెలుగు సినిమా ద్వారా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఓ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Tollywood: టాలీవుడ్‌లోకి టీమిండియా క్రికెటర్ భార్య.. ఆ యంగ్ హీరోతో కలిసి సినిమా
Dhanashree Verma
Basha Shek
|

Updated on: Nov 22, 2024 | 8:21 PM

Share

సినీ తారలు, క్రికెటర్లు పెళ్లి చేసుకునే సంప్రదాయం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే క్రికెటర్లను పెళ్లాడిన తర్వాత చాలా మంది నటీనటులు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ప్రముఖ క్రికెటర్ భార్య ఇప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తోంది. అది కూడా తెలుగు సినిమా ద్వారానే! ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్, ఆర్సీబీ మాజీ క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ ఒక తెలుగు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా పాపులర్. అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో, ధన్‌శ్రీ తన డ్యాన్స్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది. ధనశ్రీ కొన్ని డ్యాన్స్ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. ఇప్పుడు తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. డ్యాన్స్ ప్రధాన కథాంశంతో రూపొందుతున్నఈ సినిమాలో ధనశ్రీ కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ యష్ హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికుమార్ ముత్తులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ధనశ్రీ ఇప్పటికే ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో కథానాయిక కోసం భరతనాట్యం నుంచి ఆధునిక నృత్యం వరకు వివిధ రకాల నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న నటి కోసం చిత్ర బృందం వెతికారట. చాలా ఆడిషన్స్ తర్వాత ధనశ్రీని అడిగారట. ఆ పాత్ర నచ్చిన ధనశ్రీ నటించేందుకు అంగీకరించిందట. ఈ సినిమాలోని కొన్ని భాగాలను ముంబైలో చిత్రీకరించారు. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. సినిమాలో ధనశ్రీతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. మరో ఫీమేల్ లీడ్ కోసం సీరత్ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి కూడా కనిపించనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

భర్త చాహల్ తో ధన శ్రీ వర్మ..

కాగా ఫేమస్ యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ధన శ్రీ వర్మ. ఆమె డ్యాన్స్ లకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. గతంలో పలువురు భారత క్రికెటర్లతో కలిసి స్టెప్పులేసిందీ అందాల తార.

చాహల్, ధనశ్రీల రొమాంటిక్ ఫొటోస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన

హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..

తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం

భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు

ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..

కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

'భరించలేకపోతున్నా...' కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ బాగోతం