AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సడెన్ గా వారణాసిలో ప్రత్యేక్షమైంది. తన తల్లితో కలిసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతన్నాయి.

Sreeleela: కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
Sreeleela
Basha Shek
|

Updated on: Nov 23, 2024 | 4:09 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీ యెస్ట్ హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ పోతినేని, రవితేజ, నితిన్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. అయితే గతేడాది ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేకపోయాయి. దీంతో గ్యాప్ తీసుకున్న ఈ సొగసరి ఇప్పుడు ఏకంగా స్పెషల్ సాంగ్ తో అభిమానులను పలరించేందుకు సిద్ధమైంది. అల్లు అర్జున్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ఫలో శ్రీలల ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. కిస్సిక్ అనే ఈ స్పెషల్ సాంగ్ ఆదివారం (నవంబర్ 24న) రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్, ప్రోమోకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ కిస్సిక్ సాంగ్ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ఆడియన్స్. అయితే ఈ సాంగ్ రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం ఉండగా సడెన్ గా కాశీలో ప్రత్యక్షమైంది శ్రీలీల. అక్కడ తన తల్లి స్వర్ణలతతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. అలాగే పవిత్ర గంగా ఘాట్ ను కూడా దర్శించుకుంది. అయితే సడెన్ గా శ్రీలీల కాశీలో ఎందుకు పూజలు చేయాల్సిందో తెలియరావడం లేదు. కానీ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

అయితే పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ సాంగ్ మంచి సక్సెస్ సాధించాలని శ్రీలీల వారణాసిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కిస్సిక్ సాంగ్ శ్రీలీల కెరీర్ లో చాలా స్పెషల్. గతేడాది ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. దీంతో అర్జెంట్ గా శ్రీలీలకు ఓ భారీ హిట్ అవసరం. అలాంటిది ఏకంగా ఐకాన్ స్టార్ తో స్పెషల్ సాంగ్ చేయడమంటే మాములు విషయం కాదు. అందుకే శ్రీలీల వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుందని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం శ్రీలీల సుమారు 2 కోట్ల పారితోషకం తీసుకుందని తెలుస్తోంది. ఆదివారం ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

కిస్సిక్ సాంగ్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us