AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 75 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు మాలీవుడ్ సినిమాలను ఆదిరిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రతి వారం ఓటీటీ సంస్థలు ఏదో ఒక మలయాళ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 75 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
Kishkindha Kaandam Movie
Basha Shek
|

Updated on: Nov 22, 2024 | 7:52 PM

Share

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజత్వానికి దగ్గరగా ఆకట్టుకునే కథా కథనాలు, నటీనటుల అద్భుత పర్ఫామెన్స్ తో మాలీవుడ్ మూవీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై అదరగొడుతున్నాయి. అలా ఇప్పుడు మరొక మలయాళ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. అలాగనీ ఆ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. ఒక్క పాట లేదు. ఫైట్స్ కూడా లేవు. కానీ ఈ సినిమా చూసిన వారందరూ థ్రిల్ గా ఫీలవుతున్నారు. అంతేకాదు సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతలా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోన్న ఆ సినిమా పేరు కిష్కింద కాండం. పేరు చెప్పగానే ఇదేదో జానపద సినిమా అనుకునేరు. అదేమీ కాదు.. ఇదొక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు దింజిత్‌ అయ్యతన్‌ తెరకెక్కించిన కిష్కింద కాండం సినిమాలో సిఫ్‌ అలీ, అపర్ణా బాలమురళి, విజయ రాఘవన్‌, జగదీశ్‌, అశోకన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం రూ.7 కోట్లతో ఈ మూవీ తీస్తే బాక్సాఫీస్‌ వద్ ఏకంగా రూ.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాల్లో ఒకటిగా ఈ కిష్కింద కాండం సినిమా నిలిచింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

కిష్కింద కాండం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది .ఇటీవలే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ కిష్కింద కాండం సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ‘కిష్కింద కాండం’ టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది కోతులు తిరిగే ప్రదేశంలో జరిగే కథ. అలాగే ఒక కోతి శవం కారణంగానే కథ కూడా ఊహించని మలుపులు తిరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే కిష్కంద కాండం సినిమాను చూడాల్సిందే. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ..

కిష్కింద కాండం ట్రైలర్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్