Unstoppable with NBK S4: ఎంటర్‌టైన్మెంట్ అద్దిరిపోయింది.. బాలయ్య- బన్నీ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతోంది. ఇటీవలే ఈ అన్ స్టాపబుల్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా విచ్చేశాడు.

Unstoppable with NBK S4: ఎంటర్‌టైన్మెంట్ అద్దిరిపోయింది.. బాలయ్య- బన్నీ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
Unstoppable With NBK Season 4
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2024 | 6:10 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ టాక్ షో కు వచ్చిన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కాగా మొత్తం రెండు ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్, నిర్మలమ్మ రాగా రెండో ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ- అయాన్ కూడా సందడి చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్ చరిత్రంలో ఏ ఎపిసోడ్ కి రానన్ని వ్యూస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ కి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఓటీటీనే ప్రకటించింది. బాలయ్య టైమింగ్, అల్లు అర్జున్ క్రేజ్, అల్లు అర్జ- అయాన్ ల అల్లరితో ఈ ఎపిసోడ్ కు రికార్డు వ్యూస్ వచ్చాయని ఆహా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కాగా బాలయ్య ఎపిసోడ్ లో పూర్తిగా ఓపెన్ అయిపోయాడు అల్లు అర్జున్. జాతీయ అవార్డు అందుకోవడం దగ్గరి నుంచి మెగా ఫ్యామిలీతో అనుబంధం, ప్రభాస్, మహేష్ బాబులతో రిలేషన్ షిప్ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి తన మనసులోని మాటలను బయటపెట్టాడు బన్నీ. ఇక పుష్ప 2 సినిమా కోసం తాను పడిన కష్టం, ముఖ్యంగా లేడీ గెటప్ కోసం ఎక్కువ సేపు మేకప్ తో గంటల తరబడి కూర్చోవడం ఎంత కష్టమో అందరితో పంచుకున్నాడు బన్నీ.

అన్ స్టాపబుల్ లో ర్యాపిడ్ ఫైర్ ..

ఇక ఇదే షోలో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ- అయన్ ల అల్లరి మాములుగా లేదు. అయితే అన్నిటికంటే హైలెట్ ఏమిటంటే.. అటజనీ కాంచె పద్యాన్నిఅల్లు అర్హ గుక్కతిప్పుకోకుండా చెప్పడం. ఇది చూసిన బాలయ్య..’అర్హ లాంటి పిల్లలు ఉండడం వల్ల తెలుగు ఇంకొన్ని కాలాల పాటు జీవిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇది అన్ స్టాపబుల్ షోకు మరింత హైప్ తెచ్చింది. మరి మీరు కూడా అల్లు అర్జున్ మాటలు, అల్లు అర్హ, అయాన్ ల అల్లరి చూడాలనుకుంటే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 చూసేయండి.

అల్లు అయాన్, అర్హల అల్లరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..