KA OTT: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘క’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ క సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

KA OTT: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
KA Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2024 | 7:17 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా క. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ విలేజ్ అండ్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. బరిలో ఉన్న లక్కీ భాస్కర్, అమరన్, బఘీరా వంటి సినిమాలను తట్టుకుని మరీ భారీ వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ తదితర ప్రముఖులు క సినిమాను చూసి కిరణ్ అబ్బవరం టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవలే మలయాళంలో కూడా రిలీజైన క సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. క సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా క సినిమా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ‘ ఆడుదాం.. ‘క’చ్చితంగా.. ఈసారి అద్దిరిపోయే సప్పుడుతో, అద్భుతమైన పిక్చర్స్ తో. నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ లో క సినిమా స్ట్రీమింగ్ కానుంది’ అని అందులో రాసుకొచ్చింది ఈటీవీ విన్.

చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. 1977 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ థ్రిల్లర్ నిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో అద్బుతంగా నటించాడు. అలాగే అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. మరి క సినిమా థియేటర్స్ లో మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే నవంబర్ 28న ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

క సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.