- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur taking care to choosing correct scripts for her upcoming movie hits
Mrunal Thakur: వెయిట్ అండ్ సి అంటున్న మృణాల్
సినిమా తారల కెరీర్ సౌత్‌లోనూ, నార్త్ లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది కదా... జస్ట్ ఈ భాషల్లో సినిమాలు చేస్తేనే కెరీర్‌లో ఏదో సాధించేసినట్టు కాదు. అంతకు మించి ఏదో ఉంటుందని ఆశిస్తున్నా అంటున్నారు నటి మృణాల్ ఠాకూర్. ఇంతకీ ఆమె చెప్పదలచుకున్నదేంటి?
Updated on: Nov 24, 2024 | 12:13 PM

కెరీర్ స్వింగ్ మీదున్నప్పుడు కావాలనే సినిమాలను ఒప్పుకోవడంలో మృణాల్ ఆలస్యం చేస్తున్నారా? లేకుంటే, ఆమెను వెతుక్కుంటూ మేకర్స్ వెళ్లడం లేదా? ఇదీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాక్.

అయితే దీని గురించి తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చేశారు మృణాల్ ఠాకూర్. జస్ట్ తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలకే తన కెరీర్ పరిమితం కాదంటున్నారు ఈ బ్యూటీ. అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నానని చెబుతున్నారు.

వచ్చిన కథల్లో నాకు నచ్చినవి నేను ఎంపిక చేసుకోవడం ఇంతకు ముందు జరిగింది. కానీ, ఇప్పుడు మేకర్స్ నాకోసమే స్పెషల్‌గా స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. సీతారామమ్, హాయ్‌నాన్న లాంటి సబ్జెక్టులు నా మీద బాధ్యతను పెంచాయి.

ప్రేక్షకులు తమ ఇంటి పిల్లగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే నెక్స్ట్ చేయబోయే సినిమాలు అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను అని డిక్లేర్ చేశారు మృణాల్.

నాకోసమే స్పెషల్‌గా పాత్రలు రాయిస్తున్నట్టు మేకర్స్ చెబుతుంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటూ ఓ బెంచ్ మార్క్ ఉందనుకున్నప్పుడు సంతోషం వేసింది. అందుకే కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు, ప్రేక్షకులను మెప్పించే పాత్రలనే ఓకే చేస్తాను. నాకు చాలా పెద్ద కెరీర్ ఉందన్న విషయాన్ని నేనెప్పుడూ నమ్ముతాను అని అంటున్నారు మృణాల్ ఠాకూర్.




