OTT: వెన్నులో వణుకు పుట్టించే తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో వెన్నులో వణుకు పుట్టించిన ఈ వెబ్ సిరీస్ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటిగా తెరకెక్కిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ వికట కవి. గత కొన్ని రోజులుగా ఈ తెలుగు సిరీస్ ప్రమోషన్లు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వికట కవి వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 నిర్మించింది. కంటెంట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్‌కు చాలా మంచి పేరు వస్తుంది. చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. సాగర్, మహేంద్ర ఇలా అందరూ కష్టపడి చేశారు. నరేష్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి విజయాలు దక్కాలి. మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జీ5లో నవంబర్ 28న ఈ సిరీస్‌ను అందరూ చూడండి’ అని అన్నారు.
ఇక హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ‘జీ5లో నేను పసుపు కుంకుమ సీరియల్ చేశాను. ఇప్పుడు లీడ్‌గా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను. రామ్ తాళ్లూరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. దేశ్ రాజ్ పట్టు పట్టి నాకు ఈ పాత్రను ఇచ్చారు. పరువు వెబ్ సిరీస్ చూసి నన్ను అనుకున్నందుకు థాంక్స్. షోయబ్ మా అందరినీ అద్భుతంగా చూపించారు. ఇంత క్వాలిటీతో తెలుగులో ఓ సిరీస్ రాలేదనిపించింది. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. డైరెక్టర్ పక్కనే కూర్చుని అన్నీ గమనిస్తుంటారు. మేఘా ఆకాష్ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. చాలా చక్కగా నటించారు. ప్రదీప్ గారు అద్భుతంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ‘సాయి తేజ గారు అద్భుతంగా ఈ కథను రాశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. ప్రదీప్ గారి డైరెక్షన్ టీం ఎంతో సహకరించింది. నరేష్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. వికటకవి నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని తెలిపింది.
జీ5 లో స్ట్రీమింగ్..
#VikkatakaviOnZee5 is Trending #8 – Most anticipated shows in India based on popularity 🔥
Get ready for a journey of secrets with #Vikkatakavi Premieres 28th November@nareshagastya @akash_megha @pradeepmaddali @Zee5global @itsRamTalluri #RajaniTalluri @srtmovies @Desharaj12 pic.twitter.com/4JvZ11uoWM
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 25, 2024
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ‘సర్వం శక్తిమయం తరువాత ఏ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో రామ్ తాళ్లూరి గారిని కలిశాను. ఈ కథను ఆయన వినిపించారు. నాకు అద్భుతంగా నచ్చింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. అద్భుతమైన టీం సెట్ అయింది. షోయబ్ కెమెరా వర్క్, అజయ్ మ్యూజిక్, గాయత్రి క్యాస్టూమ్, కిరణ్ ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. నరేష్ అగస్త్యను మత్తు వదలరా నుంచి ఫాలో అవుతున్నాను. ఆయనతో పని చేయాలని అనుకుంటూ ఉన్నాను. నరేష్ అద్భుతంగా నటించారు. ధనుష్ తూటా చిత్రంలో మేఘా నటన నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో లక్ష్మీ పాత్రను మేఘా ఆకాష్ చక్కగా పోషించారు. మా వెబ్ సిరీస్ జీ5లో నవంబర్ 28న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
వికటకవి వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.